Politics

ఎన్నికలపై దూకుడు పెంచుతున్న బీజేపీ

ఎన్నికలపై దూకుడు పెంచుతున్న బీజేపీ

సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీట్ల కేటాయింపు కోసం చర్యలు ప్రారంభించింది. అయితే ఎవరెవరికి సీట్లు కేటాయించాలనే దానిపై ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.సోమవారం ఢిల్లీలో పార్టీలోని పలువురులు కీలక నేతలు సమావేశమయ్యారు. ఇందులో సిట్టింగ్ ఎంపీల పనితీరు గురించి సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలు ఏజేన్సీ సంస్థల నుంచి క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

రాబోయే ఎన్నికల్లో సీట్లు కేటాయించడం కోసం పలు అంశాలను పరిగణలోకి తీసుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేవలం నేతల పనితీరు మాత్రమే కాకుండా.. వారి వ్యక్తిత్వం, సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫాలోయింగ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు కొంతమంది నేతలు తెలిపారు.అయితే పలు నియోజకవర్లాల్లో ప్రభావం చూపించని నేతలకు టికెట్ నిరాకరించి వారి స్థానంలో రాజ్యసభ నుంచి కేంద్రమంత్రులుగా ఎంపికైన వారికీ అలాగే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన 166 స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం చర్యలు తీసుకుంది.2014లో గెలిచిన 158 మంది బీజేపీ ఎంపీల్లో 2019 ఎన్నికల కోసం 55 మందికి టికెట్ ఇవ్వలేదు. ఎంపీగా గెలిచాక వారు తమ నియోజకవర్గాల్లో ప్రభావం చూపించలేదని వాళ్లకి టికెట్ ఇవ్వలేదు.