అమెరికాలో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాతో బాధపడుతూ జూలై రెండో వారంలో 7,100 మంది దవాఖానల్లో చేరారు. అంతకుముందు వారం ఈ సంఖ్య 6,444గా ఉన్నది. గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే కేసుల సంఖ్య పది శాతం పెరిగింది. కరోనా మరోవేవ్‌కు ఇది సంకేతం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరేడు నెలలుగా తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు, మళ్లీ క్రమంగా విజృంభిస్తున్నట్లు అట్లాంటాలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) కొవిడ్ మేనేజర్ డా.బ్రెండన్ జాక్సన్ తెలిపారు. గత ఏడాది జూలైలో వారానికి సుమారు 44 వేల మంది దవాఖానల పాలయ్యారు.
USలో మళ్లీ కొవిడ్ విజృంభణ
