వన్డే వరల్డ్ కప్ 2023లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నిర్ణయించిన తేదీ కన్నా ముందే జరగనుంది. అక్టోబర్ 14న మ్యాచ్ జరగనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.వాస్తవానికి అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉండగా… అదే రోజు నవరాత్రి ప్రారంభం కానుండడంతో ముందు రోజుకు మార్చినట్లు సమాచారం. కాగా, . రీషెడ్యూల్ త్వరలోనే రిలీజ్ కానుంది. కాగా, అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 వ తేదీ వరకు వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది.