యువగళం పాదయాత్రలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు (Nara Lokesh) ప్రమాదం తప్పింది. దర్శి నియోజకవర్గంలో జనం మీదపడటంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో తోపులాటలో మూడుసార్లు కిందపడే ప్రమాదం నుంచి లోకేశ్ బయటపడ్డారు. జనం తోపులాటలో తరచుగా లోకేశ్ చేతులు, కాళ్లకు గాయాలవుతున్నాయి. ఈ క్రమంలో జనాన్ని అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు విఫలమవుతున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కావాలనే లోకేశ్‌కు భద్రత కల్పించడం లేదని మండిపడ్డారు. వైకాపా పెద్దల ఒత్తిడితోనే పాదయాత్రకు భద్రత తగ్గించారని విమర్శించారు. కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.