Business

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు-TNI నేటి వాణిజ్య వార్తలు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు-TNI నేటి వాణిజ్య వార్తలు

*   హైబ్రిడ్ పథకాలకు హై డిమాండ్

హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇన్వెస్టర్లను తెగ ఆకర్షిస్తున్నాయి.  జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ. 14వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్​మెంట్లు ఈ ఫండ్స్‌‌‌‌లోకి  వచ్చాయి.  2022 ఏప్రిల్–-జూన్ క్వార్టర్​లో హైబ్రిడ్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రూ. 10,084 కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో వచ్చిందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) వెల్లడించింది. ఈ క్వార్టర్​లో హైబ్రిడ్ ఫండ్స్, ఇటువంటి పథకాల  ఫోలియో సంఖ్యల అసెట్ బేస్ పెరిగింది. హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్ పథకాలు. ఇవి సాధారణంగా ఈక్విటీ , డెట్ సెక్యూరిటీల కలయికతో ఉంటాయి.  కొన్నిసార్లు బంగారం వంటి ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెడతాయి. ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మధ్యస్త లేదా తక్కువ- రిస్క్ ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉంటాయి కాబట్టి పెట్టుబడిదారులను మరింతగా ఆకర్షిస్తాయి. వీటిలో కొంత మొత్తం ఈక్విటీల్లో ఉన్నప్పటికీ ఒడిదుడుకులు ఎక్కువగా ఉండవు. ఈ ఏడాది మార్చి క్వార్టర్​లో రూ. 7,420 కోట్లు, డిసెంబర్ క్వార్టర్​లో రూ. 7,041 కోట్లు, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 14,436 కోట్లు రావడంతో ఈ ఏడాది జూన్ క్వార్టర్​లో హైబ్రిడ్ ఫండ్ల విలువ రూ. 14,021 కోట్లకు చేరింది. 2021 డిసెంబరులో ముగిసిన నాలుగు క్వార్టర్​లో, ఇటువంటి పథకాలు రూ. 20,422 కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోను ఆకర్షించాయి. క్లయింట్ అసోసియేట్స్ కో–ఫౌండర్​ హిమాన్షు కోహ్లి మాట్లాడుతూ పన్నుల రేట్లు తక్కువగా ఉండటం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో విపరీతంగా రావడానికి కారణమని చెప్పారు. పెట్టుబడిదారులు తమ కేటాయింపులను డెట్ మ్యూచువల్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు తగ్గించి, హైబ్రిడ్ ఫండ్లకు పెంచుతున్నారని వివరించారు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ వార్షిక రాబడులు 7 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 

*  గంట వ్యవధిలో రూ.3.39లక్షల ఐటీఆర్ దాఖలు

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుకు గడువు నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. నిన్నటివరకు (జూలై 30) రూ.6.13కోట్ల ఐటీఆర్ దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఇవాళ మ. 12 గంటల వరకు రూ.11.03లక్షల ఐటీఆర్ దాఖలయ్యాయని, ఉ.11 నుంచి మ.12 గంటల మధ్య (గంట వ్యవధిలో) రూ. 3.39లక్షల ఐటీఆర్ దాఖలైనట్లు తెలిపింది. ఏదైనా సహాయం కోసం orm@cpc.incometax.gov.in. వెబ్సైట్లో సంప్రదించాలని పేర్కొంది.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైనప్పటికీ… ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 367 పాయింట్లు లాభపడి 66,528కి పెరిగింది. నిఫ్టీ 107 పాయింట్లు పుంజుకుని 19,754కి ఎగబాకింది.

మారుతీ సుజుకీ అదుర్స్‌

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) త్రైమాసిక ఫలితాల్లో (Q1 Results) అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో రెండింతలకుపైగా వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1036 కోట్లుగా ఉన్న నికర లాభం రూ.2,525 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం సైతం రూ.26,512 కోట్ల నుంచి రూ.32,338 కోట్లకు పెరిగినట్లు ఎక్స్ఛేంజీకిచ్చిన సమాచారంలో ఆ కంపెనీ పేర్కొంది.సమీక్షా త్రైమాసికంలో మొత్తం 4,98,030 వాహనాలను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే 6.4 శాతం మేర పెరగడం గమనార్హం. అదే సమయంలో దేశీయ విక్రయాల్లో 9 శాతం వృద్ధి నమోదవ్వగా.. ఎగుమతుల్లో 9 శాతం క్షీణత నమోదైంది. ఇంకా 3.55 లక్షల వాహన ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వీలైనంత త్వరగా వాటిని డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు కంపెనీ ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో సోమవారం మారుతీ సుజుకీ షేర్లు 1.6 శాతం లాభంతో రూ.9,821 వద్ద ముగిశాయి.

అకౌంట్లలోకి రూ.13వేలు.. ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ.. బ్యాంకు ఖాతాను NPCI పోర్టల్లో ఆధార్ లింక్ చేసుకోని వారికి డబ్బులు జమకాలేదు. అలాంటి వారు వెంటనే అనుసంధానం చేసుకుంటే ఈ వారంలోనే డబ్బులు చెల్లిస్తామని అధికారులు తెలిపారు. కాగా, గతనెల 28న 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున రూ.6,392 కోట్లను సీఎం జగన్ జమ చేసిన విషయం తెలిసిందే.

ఫ్లిప్ కార్డు వాటాలను కొనుగోలు చేసిన వాల్మార్ట్

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో భారీ స్థాయిలో వాటాలను వాల్మార్ట్ కొనుగోలు చేసింది. హెచ్ఎండ్ సంస్థ టైగర్ గ్లోబల్స్ నుంచి ఈ వాటాలను వాల్మార్ట్ దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 11.5 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ మేరకు టైగర్ గ్లోబల్ సంస్థ తన ఇన్వెస్టర్లకు లేఖలో వివరాలు వెల్లడించింది. 2007లో ఫ్లిప్కార్ట్ను స్థాపించగా.. 2009లో టైగర్ గ్లోబల్ ఇందులో పెట్టుబడులు పెట్టింది.

* ఎమర్జన్సీలో డబ్బులు అవసరమా: ఎల్ఐసీ

ఆర్థిక మాంద్యం దెబ్బకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త సంవత్సరంలో చాలా కంపెనీలు లేఆఫ్‌లు కూడా చేశారు. అటువంటి పరిస్థితిలో, చాలా సార్లు ప్రజలకు అకస్మాత్తుగా డబ్బు అవసరం. దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన పాలసీదారులకు అనేక సౌకర్యాలను అందజేస్తూనే ఉంది. ఎల్ఐసీ పాలసీ కొనుగోలు చేసిన పాలసీ దారులకు  పన్ను ప్రయోజనం, సేవింగ్స్ , బీమా కవర్ వంటి అనేక సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఎల్‌ఐసి తన పాలసీదారునికి పాలసీపై రుణం పొందే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. మీకు డబ్బు అవసరమైతే ఎల్‌ఐసీ పాలసీపై రుణం తీసుకోవచ్చు.

భారత్ లో  వ్యాపారాన్ని విస్తరిస్తోన్న నెస్లే

నెస్లే కంపెనీ ఇండియాలో తమ ప్లాంట్లను విస్తరిస్తోంది. 2025 నాటికి దేశంలో రూ.4,200కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగంగా ఒడిశాలో దేశంలోనే తమ 10వ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ తెలిపారు. ఈ ఏడాది తొలి 6నెలల్లో రూ.2100కోట్ల ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మ్యాగీ, కిట్ క్యాట్, వెస్కేఫీ వంటి పాపులర్ ఉత్పత్తులను ఈ సంస్థ క్రయిస్తోంది.

రెండు నెలల్లో రూ. 14,302 కోట్ల విలువైన జీఎస్టీ ఎగవేతల గుర్తింపు

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో రూ. 14,302 కోట్ల విలువైన జీఎస్టీ ఎగవేత దారులను గుర్తించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం లోక్‌సభలో దీనికి సంబంధించి వివరాలను వెల్లడించారు. ఎగవేసిన దాంట్లో రూ. 5,716 కోట్లను రికవరీ చేసినట్లు మంత్రి చెప్పారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), ఆదాయ పన్ను ఎగవేత, కస్టమ్స్ విభాగం గుర్తించిన స్మగ్లింగ్ వివరాలను మంత్రి అందించారు.గణాంకాల ప్రకారం, 2020-21, 2023-24(ఏప్రిల్-మే) మధ్య 43,516 కేసుల్లో రూ. 2.68 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేతలను కనుగొన్నాం. అందులో రూ. 76,333 కోట్ల రికవరీ జరగ్గా, 1,020 మందిని అరెస్ట్ చేశామని మంత్రి వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే మధ్య 2,784 కేసుల్లో 28 మందిని అరెస్టు చేశామన్నారు. గత నాలుగేళ్ల కాలంలో కస్టమ్స్ శాఖ 42,754 అక్రమ స్మగ్లింగ్ కేసులను గుర్తించామని, వాటి విలువ సుమారు రూ. 46,000 కోట్లు ఉంటుందన్నారు.

టమాటాల కోసం పిల్లలను తాకట్టు పెట్టాడు

ఐఫోన్ కోసం కన్నబిడ్డను అమ్మిన ఘటన మరువకముందే.. రెండు కిలోల టమాటాల కోసం ఇద్దరు పిల్లలను తాకట్టు పెట్టిన ఘటన వెలుగుచూసింది. ఒడిశాలోని కటక్లో ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలతో వచ్చి దుకాణంలో టమాటాలు కొన్నాడు. ‘పర్సు కారులో ఉంది. తీసుకొస్తా. పిల్లలను చూస్తుండు’ అని దుకాణాదారుడికి చెప్పిన అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ ఇద్దరు పిల్లలు పరారైన వ్యక్తి వద్ద పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.