Politics

గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్:బండి సంజయ్

గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్:బండి సంజయ్

కరీంనగర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ను క్రాస్ ఎగ్జామినేషన్‌ చేయనున్నారు. ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్‌ చేయడానికి కోర్టు రిటైర్డ్‌ జిల్లా జడ్జి శైలజను నియమించింది. దీనికి సంబంధించి అనుమతులు మంజూరు చేస్తూ, ఆగస్టు 12వ తేదీ నుంచి 17వ తేదీన వరకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ పూర్తి చేయాలని, తరువాత ఆ నివేదికను కోర్టుకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్ బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపర్చారని ఆరోపిస్తూ, ఆయన ఎన్నికల చెల్లదని ప్రకటించాలని ఆయన ప్రత్యర్థిగా ఉన్న బండి సంజయ్ 2019 జనవరిలో కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిగింది.

కాగా.. తాజాగా ఈ కేసులో జస్టిస్ సుమలతతో కూడిన బెంచ్ సోమవారం మళ్లీ విచారణ చేపట్టింది. ఈ కేసులో వాదనలు విన్నారు. విచారణకు తాను అందుబాటులో ఉండలేనని, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయని బండి సంజయ్ కోర్టుకు తెలిపారు. కొంత సమయం ఇవ్వాలని కోరారు. అయితే ఆగస్టు 12వ తేదీన 17వ తేదీ వరకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ జరుపుతామని, అందుబాటులో ఉండాలని కోర్టు సూచించింది. ఈ కేసులో ఆధారాలను కోర్టు కమిషనర్ కు అందజేయాలని సూచించారు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్‌ చేసేందుకు ధర్మాసనం టైర్డ్‌ జిల్లా జడ్జి శైలజ నియమించింది. ఈ కేసులో మళ్లీ విచారణ ఈ నెల 21వ తేదీన జరగనుంది.