మన శరీరానికి క్యాల్షియం చాలా అవసరం. ఎముకలు బలంగా ఉండటానికి క్యాల్షియం సహాయపడుతుంది.కండరాలు, నరాల వ్యవస్థ పనితీరుకు కూడా ఇది చాలా అవసరం. కొంత మందిలో ఇది తక్కువగా ఉంటుంది. శరీరంలో క్యాల్షియం తగ్గినప్పుడు ఎముకలు, దంతాలు చాలా బలహీనపడతాయి. శరీరంలో క్యాల్షియం లోపించినప్పుడు ఎముకల నుంచి ఇతర పోషకాలను గ్రహించడం వల్ల క్యాల్షియం లోపం ఏర్పడుతుంది.క్యాల్షియం తక్కువగా ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
- మన శరీరంలో కండరాల నొప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటే .. అది క్యాల్షియం లోపమని గుర్తించాలి. దీనికి వెంటనే చికిత్స తీసుకోవాలి. శరీరంలో లో క్యాల్షియం లెవెల్స్ తగ్గినప్పుడు మాత్రమే కండరాల నొప్పి వస్తుంటుంది.
- సాధారణంగా మనలో కొంతమందికి వణుకుడు సమస్య వస్తుంది. ఇది కూడా క్యాల్షియం లోపమే.
- చిన్న విషయానికి కూడా డీప్ గా ఆలోచిస్తూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. క్యాల్షియం తక్కువగా ఉంటే ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది.
- శరీరంలో క్యాల్షియం లోపిస్తే.. మానసిక, శారీరక సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ఎక్కువగా అలసిపోవడం, త్వరగా నీరసపడటం వంటి సమస్యలు వస్తాయి.
- క్యాల్షియం లోపంతో బాధపడేవారిలో ఆకలి చాలా తగ్గిపోతుంది. అలాగే ఏమి తిన్నా కడుపులో వికారంగా ఉంటుంది.