* బట్టల షాపుకు కన్నం వేసి బంగారం చోరీ
బట్టల షాప్ కు కన్నం వేసి బంగారం దొంగతనం చేశారు దుండగులు …ఈ దొంగతనం జరిగింది ఎక్కడ అనుకుంటున్నారా హైదరాబాద్ శివారు చందానగర్లోని ఓ గోల్డ్ షాపులో జరిగింది దొంగతనం. అయితే బంగారం షాపులో ఎక్కడ దొంగలు షట్టర్ పగలగొట్టడం గానీ తాళాలు తీయడం గాని చేయలేదు కానీ షాపులో ఉన్నటువంటి బంగారం మొత్తం మాయమైపోయింది. బంగారం షాప్ లో దొంగతనం జరిగిందని నిర్వాహకులు అవక్కయురు… ఒక జ్యువలరీ షాప్ లో 40 బంగారం అపహరణకు గురైంది అయితే కూడా షాపులో డోర్ కానీ షట్టర్ కానీ కూడా పగల కొట్టకుండా లోపటికి ఎంట్రై దుండగులు దొంగతనం చేశారు … ఇది ఎలా అనుకుంటున్నారా ఆ బంగారం షాపు పక్కనే ఉన్నటువంటి ఒక బట్టల షాపుకు కన్నం వేసి ఆ బట్టల షాప్ నుంచి బంగారు షాప్ లోకి వెళ్లి అక్కడ దొంగతనానికి పాల్పడినట్టుగా సీసీ కెమెరాల్లో అర్థమవుతుంది… మొత్తం షాపులో ఉన్న 40 తులాల బంగారం మొత్తం చోరీ జరిగింది.
* చెన్నై సమీపంలో ఎన్‌కౌంటర్
తమిళనాడు(Tamil Nadu)లో ఎన్‌కౌంటర్ కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో చెన్నై సమీపంలోని గుడువంచేరీ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు మృతి చెందారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.గుడువంచేరీలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు తనిఖీ నిమిత్తం ఒక ఎస్‌యూవీ ఆపేందుకు ప్రయత్నించారు. ఎస్‌యూవీలో ఉన్న నలుగురు వ్యక్తులు తమ వాహనాన్ని ఆపకపోగా.. పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా వారు పోలీసులపై దాడి చేసి, బాంబు విసిరారు. ‘దాడి జరగడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. దాంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే దగ్గల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి’ అని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.మృతులు పలు హత్య కేసుల్లో నిందితులని తెలిపారు. అలాగే మరో ఇద్దరు ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్ గాయపడ్డారని పేర్కొన్నారు.
* అంధవిశ్వాసంతో ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి
డూమ్స్‌డే’ అంధవిశ్వాసంతో తన ఇద్దరు పిల్లల్ని హతమార్చడంతో పాటు తన భర్త మొదటి భార్య హత్య కుట్ర పన్నిన ఒక అమెరికా మహిళకు జీవిత ఖైదు విధించబడింది. ఆ మహిళ పేరు లోరీ వాల్లో. ఈ ఏడాది మే నెలలో తన 16 ఏళ్ల కుమార్తె టైలీ ర్యాన్, దత్తత కుమారుడు జాషువాను హత్య చేసిన కేసులో ఆమె దోషిగా తేలింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇడహోలోని కోర్టు జడ్జి స్టీవెన్ తన తీర్పుని వెల్లడిస్తూ.. ‘‘ఎలాంటి పెరోల్‌కి అనుమతి లేకుండా నీకు జీవితఖైదు శిక్ష విధిస్తున్నాం’’ అని చెప్పారు.కాగా.. యేసుక్రీస్తు రెండో రాక కోసం మానవాళిని సిద్ధం చేయడానికి తాను మానవరూపంలో పుట్టిన దేవత అని లోరీ వాల్లో పేర్కొంది. తాను దేవదూతలతోనూ కమ్యూనికేట్ చేయగలదని కోర్టులో చెప్పింది. ఆమె వాదనలు విన్న తర్వాత.. తన హత్యలను సమర్థించుకోవడానికి ఆమె మత విశ్వాసాల్ని కారణంగా చూపుతోందని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆమె నేరాల వెనుక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అటు.. లోరీ ఐదో భర్త చాడ్ డేబెల్, తన మొదటి భార్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటుండగా, అతడ్ని నిర్దోషిగా తేల్చారు.ఇదిలావుండగా.. లోరీ వాలో పిల్లలు 2019లో కనిపించకుండా పోయినప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ పిల్లలు కనిపించడం లేదని లోరీ, ఆమె భర్త డేబెల్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఫైనల్‌గా ఇడహోలో డేబెల్ ప్రాపర్టీలో ఆ ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ పిల్లలతో పాటు ఈ భార్యభర్తలకు సన్నిహితంగా ఉన్నవారు కూడా హత్యకావింపబడ్డారని విచారణలో తేలింది. వారిలో డేబెల్ మొదటి భార్య టామీ కూడా ఉన్నారు. ఈ జంట హవాయికి వెళ్లడానికి కొన్ని వారాల ముందు, 2019 అక్టోబర్‌లో ఆమె మృతి చెందింది.
* హైదరాబాద్‌లో ఉగ్రవాది అరెస్ట్
హైదరాబాద్, భూపాల్ మాడ్యూల్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్ సమీపంలోని రాజేంద్ర నగర్‌లో హట్‌కు చెందిన సల్మాన్ అనే ఉగ్రవాదిని మంగళవారం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. సల్మాన్‌పై మే 24న కేసు నమోదు చేశారు. ఇవాళ అతనికి సంబంధించిన రెండు ఇళ్లలో సోదాలు చేయగా.. భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. హార్డ్ డిస్క్‌లతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హట్ ద్వారా ఉగ్రవాద సంస్థలోకి సల్మాన్ యువతను రిక్రూట్ చేస్తున్నట్లు గుర్తించారు. షరియా చట్టం కోసం భారత్‌లో కుట్రలకు హట్ ప్లాన్ చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అధికారులు ఇవాళ సల్మాన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరైస్టైన వారి సంఖ్య 17కు చేరింది.
* ఎక్స్‌ప్రెస్ హైవే పనుల్లో ఘోర ప్రమాదం
మహారాష్ట్రలో కొనసాగుతున్న సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేజ్-3 పనుల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గిర్డర్ యంత్రం కుప్పకూలి 14 మంది కార్మికులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. థానే జిల్లాలోని షాపూర్‌లో మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. రోడ్డు పనుల్లో భాగంగా వంతెన నిర్మిస్తుండగా.. పిల్లర్లతో అనుసంధానించే గిర్డర్ యంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. అది కార్మికులపై పడటంతో చాలామంది ప్రమాద స్థలిలోనే మృతిచెందారు. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి ఈ యంత్రం పడిపోయినట్టు సమాచారం. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
* లారీ ఢీ కొని యువకుడు మృతి
లారీ ఢీ కొని ఓ గర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం మండల పరిధిలోని రాయికల్ టోల్ గేట్ సమీపంలో వెలుగుచూసింది. పట్టణ సీఐ ప్రతాప్‌లింగం తెలిపిన వివరాల ప్రకారం … గత నెల 30 న టోల్ ప్లాజా సమీసంలో ఏపీ37టిఎఫ్3685 నంబర్ గల లారీ గుర్తు తెలియని యువకుడిని ఢీ కొట్టడంతో తలకు బలయమైన గాయంతో అక్కడికక్కడే చనిపోయాడన్నారు.స్థానికులు ఇచ్చిన సమాచారంతో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బంది ఘటన స్థలాకి చేరుకున్నారని ప్రమాద వివరాలను సేకరించినట్లు తెలిపారు. డైవర్ నిర్లక్షం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని, మృతుని వయస్సు సుమారుగా 25 నుండి 30సంవత్సరాలు ఉంటాయని, మృత దేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
* డాక్టర్ నిర్లక్ష్యంతో తల్లి గర్భంలోనే శిశువు మృతి
నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం ఓ పసికందు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మహిళకు సిజేరియన్ చేసే క్రమంలో వైద్యుల నిర్లక్ష్యంతో పురిటి బిడ్డ గర్భంలోనే కన్నుమూసింది. డాక్టర్ నిర్లక్ష్యంతో సిజేరియన్ చేస్తుండగా శిశువుకు కత్తిగాట్లు అయ్యి తల్లి కడుపులోనే శిశువు మృతి చెందింది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..అనంతపురం పట్టణానికి చెందిన రేష్మభాణుకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటీన నగరంలోని స్నేహలత హాస్పిటల్ ఆస్పత్రికి తరలించారు. నిండు గర్భిణీ అయిన రేష్మభాను జాయిన్ చేసుకుని చికిత్స నందించారు. సహజ ప్రసవం కాదని ఆమెకు సిజేరిన్ చేయాలని వైద్యులు తెలిపారు. చేసేదిలేక కుటుంబ సభ్యులు సరేనన్నారు. సిజేరియన్ చేస్తుండగా కడుపులో ఉన్న బిడ్డకు కత్తి కోసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ శిశివు గర్భంలోనే చనిపోయింది. ఆ తర్వాత మృతి చెందిన బిడ్డను బయటకు తీసి కుట్లువేశారు. ఏమీ ఎరగనట్లు బిడ్డ కడుపులోనే మృతి చెందినట్లు బంధువులకు తెలిపారు.
* ఉద్యోగాల పేరుతో మోసం
హైకోర్టులో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తికి జబల్‌పూర్‌లోని సెషన్స్ కోర్టు 110 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పురుషోత్తమ్ పాసి అనే వ్యక్తి మధ్యప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని 100 మంది నుంచి రూ.5 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేశాడు. అనంతరం వారికి మధ్యప్రదేశ్ హైకోర్టు పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను ఇచ్చాడు. అవి నకిలీవిగా తేలడంతో బాధితులు పురుషోత్తంపై పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ మోసానికి సంబంధించి 15 కేసులు నమోదుకాగా వాటిలో పురుషోత్తంను దోషిగా తేలుస్తూ జబల్‌పూర్ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. పలు సెక్షన్ల కింద ప్రతి కేసులో ఎనిమిదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.15వేలు జరిమానా కూడా విధించారు. 100 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన పురుషోత్తం ఓ మహిళా స్నేహితురాలి సాయంతో హైకోర్టు పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను తయారుచేసినట్లు విచారణలో వెల్లడైంది. లెటర్లు అందుకున్న బాధితులు విధుల్లో చేరేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్లగా.. అవి నకిలీవని తేలడంతో కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో మహిళకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.
* కోడికత్తి కేసులో కీలక పరిణామం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను విజయవాడ ఎన్ఐఏ కోర్టు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కోడికత్తి కేసులో వాద ప్రతివాదనలు విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరుగుతుందని కోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఈ కోడికత్తి కేసులో 80శాతం ట్రయల్స్ పూర్తి అయిన తర్వాత మరో కోర్టుకు బదిలీ చేయడంపై నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది గగన సింధు అన్నారు. ఇప్పటికే నాలుగు సంవత్సరాల 5 నెలలుగా శ్రీనివాసరావు జైల్లోనే మగ్గుతున్నాడని చెప్పుకొచ్చారు. ఈ కేసు విషయంలో వైఎస్ జగన్ కోర్టుకు హాజరుకావాల్సిందేనని చెప్పుకొచ్చారు. కేసు కొలిక్కిరావాలంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందేనని అన్నారు. ఈ కోడికత్తి కేసును తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని…పూర్తి స్థాయిలో తమ వాదనలు వినిపిస్తామని న్యాయవాది గగన సింధు తెలిపారు.
* పదో తరగతి విద్యార్థి గొంతు కోసిన స్నేహితుడు
పదో తరగతి విద్యార్థి గొంతు కోసి స్నేహితుడు హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. న్యూ అజాద్ నగర్‌లోని ప్రయాగ్ విద్య మందిర్ కాలేజీలో నీలేంద్ర తివారికి(15), 13 సంవత్సరాల స్నేహితుడు ఉన్నాడు. నీలేంద్ర తివారి పదో తరగతి చదువుతున్నాడు. ఓ బాలిక విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఇది మనుసులో పెట్టుకొని నీలేంద్రను చంపాలని స్నేహితుడు నిర్ణయం తీసుకొని బ్యాగ్‌లో కత్తి పట్టుకొని వచ్చాడు.సోమవారం మధ్యాహ్నం భోజనం చేస్తుండగా తివారితో స్నేహితుడు గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని మెడపై పొడిచాడు. వెంటనే ఉపాధ్యాయులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సదరు విద్యార్థి చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. గొంతు తెగడంతో విద్యార్థి చనిపోయాడని వైద్యులు తెలిపారు. నీలేంద్ర తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు జువైనల్ హోమ్‌కు తరలించారు.