NRI-NRT

డీసీలో స్నేహితుల దినోత్సవం. పాల్గొన్న ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు.

డీసీలో స్నేహితుల దినోత్సవం. పాల్గొన్న ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు.

ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమావేశం వాషింగ్టన్ డీసీలో భాను ప్రకాష్ మాగులూరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, మైనేని రాంప్రసాద్, తానా తదుపరి అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, కొమ్మి సుబ్బయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పరస్పర స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి కుంటు పడిందని రాజధాని లేని రాష్ట్రంగా, అభివృద్ధి ఆనవాలు లేని దిశగా సాగుతుందని పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రవాసాంధ్రులు తమవంతు సహాయసహకారాలు మాతృభూమికి అందించాలని కోరారు. మన్నవ సుబ్బారావు సమర్ధ నాయకత్వ లేమి వలన రాష్ట్రం పూర్తిగా అప్పులపాలైందన్నారు. తానా తదుపరి అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి భారతీయులంతా కష్టించే తత్వంతో ముందుకెళ్తున్నారని తెలిపారు. భాను మాగులూరి ప్రతిభ గల విద్యార్థులకు చేయూతనందించాలని, తెలుగు వారందరూ ప్రగతి బాటలో పయనించాలని ఆకాంక్షించారు. అనంతరం నరేన్ కొడాలిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుధీర్ కొమ్మి, రామ్ చౌదరి ఉప్పుటూరి, కిషోర్ కంచర్ల, ఆకాష్ వలేటి, రవి ఐతా, యండమూరి నాగేశ్వరరావు, పాకాలపాటి కృష్ణయ్య, బండ మల్లారెడ్డి, రమేష్ అవిరినేని, సీతారామారావు, ప్రసాద్ పారుపల్లి తదితరులు పాల్గొన్నారు.

World Friendship Day Celebrated in DC. Telugu NRI Parents Participated.