Politics

ఆగస్టు 15 నుంచి 2BHK ఇళ్లు పంపిణీ:కేటీఆర్

ఆగస్టు 15 నుంచి  2BHK ఇళ్లు పంపిణీ:కేటీఆర్

నగరంలో లక్ష రెండు పడక గదుల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్‌లోగా నియోజకవర్గానికి నాలుగు వేల చొప్పున 2BHK ఇళ్లు పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ‘‘రాబోయే ఎన్నికల్లో మళ్లీ భారాస ప్రభుత్వం వస్తుంది. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరు. కేసీఆర్‌ వయసుకు గౌరవం ఇవ్వకుండా.. నోటికొచ్చినట్లుగా, అడ్డగోలుగా మాట్లాడే పార్టీలకు బుద్ధి చెప్పాలి. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.