ఏపీ వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. గ్రామ, వార్డు వాలంటీర్ల గౌరవ వేతనాలను రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచేందుకు సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టినరోజు కానుకగా గౌరవ వేతనాల పెంపుపై ప్రకటన ఉండే అవకాశం ఉందని సమాచారం.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.30 లక్షల మంది వాలంటీర్లు… 2019 నుంచి నెలకు రూ. 5000 గౌరవ వేతనానికి పనిచేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఎన్నికల కసరత్తు వేగవంతం చేసింది వైసీపీ పార్టీ. ఇందులో భాగంగానే.. ఏపీలోని నియోజకవర్గ పరిశీలకులతో సమావేశం చేపట్టిన వైసీపీ…ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో 175 నియోజకవర్గాల అబర్జర్వర్స్ తో సమావేశం నిర్వహించనుంది. ఈ సందర్భంగా అబర్జర్వర్స్ కు దిశానిర్దేశం చేయనున్న సజ్జల… నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలు, పథకాల ప్రచారం, ఓటర్ల జాబితా, ఇతర అంశాలపై చర్చ నిర్వహిస్తారు.