తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు కేసీఆర్ ప్రభుత్వం తీపికబురు అందించింది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలు ఇస్తుండగా… దీనిలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.కాగా ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున మొత్తం 4 లక్షల మందికి రూ. 3లక్షలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం… ఎస్సీలకు 20%, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్ అమలు చేస్తోంది. కాగా, తెలంగాణ రాష్ట్రంలోని వైన్ షాపుల టెండర్లకు ముహుర్తం ఫిక్స్ అయింది. రెండు నెలల ముందే వైన్ షాపుల టెండర్లకు సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ. 2023 – 25 సంవత్సరానికి వైన్‌షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానించేందుకు సిద్ధమైంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. ఇందులో భాగంగానే.. మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది సర్కార్.