భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్ స్టాండ్-ఇన్ కెప్టెన్ హర్ధిక్ పాండ్యా వెస్టిండీస్ క్రికెట్ అసోసియేషన్ పై విమర్శలు చేశారు. తమకు క్రికెట్ వెస్టిండీస్ టీమ్ ఇండియా కోసం “ప్రాథమిక ఏర్పాటు” చేయడం లేదని మండిపడ్డారు. నిర్వాహకులు ఉన్న నిధులతోనే చాలా బాగా చేయోచ్చని అన్నాడు. అలాగే మేము లగ్జరీ కోసం అడగడం లేదు. కానీ ఉన్న దాంట్లోనే ప్లేయర్ల ప్రాథమిక అవసరాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పాండ్య అన్నారు. కాగా మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అలాగే 5 మ్యాచుల టీ20 సిరీస్ ఈ నెల 3 నుంచి ప్రారంభం కానుంది.