ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం నేటి నుంచి రోజువారీ విచారణ చేపట్టనుంది. సుప్రీం కోర్టులో ఇతర వ్యాజ్యాలను విచారించే రోజులైన సోమ, శుక్రవారాలు మినహా రోజువారీ ప్రాతిపదికన విచారణ జరుగుతుందని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 లోని నిబంధనలను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
ఆర్టికల్ 370 రద్దుపై నేటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ
