Food

అరటిపండుతో స్వీట్‌ తయారీ

అరటిపండుతో స్వీట్‌ తయారీ

అరటిపండు మైసూర్‌ పాక్‌ తయారికి కావల్సినవి:
శనగపిండి – కప్పు; నెయ్యి – కప్పు;
ఎర్ర అరటి పండ్లు – రెండు;
చక్కెర – కప్పు.

తయారీ విధానమిలా

*  శనగపిండిని పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి.

*  అరటిపండ్లు తొక్కతీసి ప్యూరీలా గ్రైండ్‌ చేయాలి.వేగిన పిండిలో కొద్దిగా నెయ్యి వేసి పేస్టులా కలిపి         దించేయాలి.

*  చక్కెరలో కప్పు నీళ్లుపోసి మరిగించాలి.తీగపాకం వచ్చిన తరువాత శనగపిండి పేస్టు, అరటిపండు        ప్యూరిని వేసి బాగా కలపాలి.

*  మిశ్రమం చిక్కగా దగ్గరపడినప్పుడు దించేసి, నెయ్యిరాసిన ప్లేటులో వేసి ముక్కలుగా కట్‌ చేస్తే             బనానా పాక్‌ రెడీ.