ఏపీలోని ప్రధాన ఆలయాలలో ఒక్కటైన విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం చాలా ఫేమస్. ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకనేందుకు వస్తుంటారు. అయితే ఈసారి అమ్మవారి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది.ఈ ఏడాది 150 కోట్ల రూపాయల వివిధ రూపాలలో ఆదాయం సమకూరింది. గత ఏడాడి 86 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. అయితే ఈ ఏడాది గత ఏడాది కంటే రెట్టింపు ఆదాయం సమకురినట్లు దుర్గగుడి ఈఓ తెలిపారు. ఈ ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత రెట్టింపు ఆదాయంలో నికర ఆదాయం నమోదైన ఆలయాల్లో ఇంద్రకీలాద్రి నిలిచింది.
2023 -24 సంవత్సరానికి కాను ఏకంగా 156 కోట్ల 96 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ రేంజ్ లో తిరుమల తర్వాత స్థానంలో ఇంద్రకీలాద్రి ఆదాయంరావడం ఇదే తొలిసారి.కరోనా తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సంఖ్యతో పాటు ఆదాయం కూడా పడిపోయింది. సాధారణంగా ఇంద్రకీలాద్రి ఆదాయం 100 కోట్ల రూపాయల లోపే ఉంటుంది. గత ఏడాది 80 కోట్ల 80 లక్షల ఆదాయం రాగా..ఈ ఏడాది రికార్డు స్థాయిలో 150 కోట్ల రూపాయలు దాటడం విశేషం. కరోనా తర్వాత 2022 -23 సంవత్సరంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింఅలా అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పించడంతో పాటు విశిష్టమైన పూజల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. అలానే టిక్కెట్ , ఎఫ్డీఆర్ లపై వచ్చే వడ్డీ ,సేవలు ,ఇతర లైసెన్స్‌ల ద్వారా గణనీయంగా ఆదాయం పెరిగింది. గతంలోనూ ఏ ఆర్ధిక సంవత్సరం లోను ఇంత ఆదాయం వచ్చిందన సందర్భం లేదు అంటున్నారు పాలకమండలి సభ్యులు. తిరుమల తర్వాత రికార్డ్ స్థాయిలో దుర్గమ్మ కు ఆదాయం