ఇళయరాజా(Ilayaraja).. ఈ పేరు తలవకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడటం చాలా కష్టం. తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేశారు ఇళయరాజా. ఇప్పటికే 1400 వందలకు పైగా సినిమాలకు సంగీతం అందించి రికార్డ్ క్రియేట్ చేశారు ఈ సంగీత జ్ఞాని. ఈ ప్రయాణంలో ఆయన సాధించిన విజయాలు, ప్రశంసలు, అవార్డులు ఎన్నో ఎన్నెన్నో. ఆలాంటి మహానుభావుడి కథ సినిమాగా చేస్తే అది ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.సరిగ్గా ఇదే ఆలోచన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బాల్కీ(Balki) వచ్చింది. అందుకే ఆయన ఇళయరాజా బయోపిక్(Ilayaraja Biopic) తీయాలనుకుంటున్నారట. ఇటీవల ఒక మీటింగ్ లో పాల్గొన్న దర్శకుడు బాల్కీ ఇళయరాజా బయోపిక్ గురించి ప్రస్తావించారు. నేను ఇళయరాజా బయోపిక్ తీయాలనుకుంటున్నాను. అది నా డ్రీం. ఈ సినిమాలో ఇళయరాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్(Danush) చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ధనుష్ మంచి సింగర్, లిరిసిస్ట్, దర్శకుడు, నిర్మాత. అందుకే ఇళయరాజాగా ఆయన చేస్తేనే బాగుంటుంది అని చెప్పుకొచ్చారు దర్శకుడు బాల్కీ.
ఇక బాల్కీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా షమితాబ్(Shamitab) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్(Amithab) కూడా నటించారు. ఈ పరిచయంతోనే దర్శకుడు బాల్కీ ఇళయరాజా బయోపిక్ కోసం ధనుష్ ను ఒప్పించనున్నారట. ఈ ప్రాజెక్టుకు సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.