Devotional

ఈ నెల 17 నుంచి శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం

ఈ నెల 17 నుంచి శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ నుంచి శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మాసంలో రెండో శుక్రవారమైన 25వ తేదీన వరలక్ష్మి వ్రతాలను పురస్కరించుకుని అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. నాల్గో శుక్రవారమైన సెప్టెంబర్‌ 8వ తేదీన ఆలయంలో ఆర్జిత సేవగా, ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో భక్తులు పాల్గొనేందుకు దేవస్థానం అవకాశం కల్పిస్తోంది. ఆర్జిత సేవగా నిర్వహించే ఈ వ్రతంలో పాల్గొనే భక్తులు రూ.1500 టికెటు కొనుగోలు చేయాల్సి ఉంది. మహా మండపం ఆరో అంతస్తులో వ్రతాలను నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ వ్రతం తొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది. సామాన్య భక్తుల కోసం నిర్వహించే ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతంలో 500 మంది పాల్గొనే అవకాశం ఉంది. ఉదయం 9 గంటలకు ఈ వ్రతాలు ప్రారంభమవుతాయి. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద ఉచిత సామూహిక వ్రతాలను నిర్వహి స్తారు. ఉచిత సామూహిక వ్రతంలో పాల్గొనే భక్తులు సెప్టెంబర్‌ మూడు నుంచి ఐదో తేదీ వరకు తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.

దుర్గగుడికి శ్రావణమాస శోభ 25న వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనం సెప్టెంబర్‌ 8న సామూహిక వ్రతాలు