Devotional

అయోధ్య రామమందిరం ప్రారంభ తేదీ ఖరారు

అయోధ్య రామమందిరం ప్రారంభ తేదీ ఖరారు

అయోధ్యలోని రామమందిరంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో ఆలయ ట్రస్ట్ నిర్వహించనుంది. ఈ మేరకు ఆలయ ట్రస్ట్ సభ్యుడు శుక్రవారం (ఆగస్టు 4) వెల్లడించారు.వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో రాయాలయంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది. జనవరి 21, 22, 23 తేదీల్లో రామయ్య విగ్రహప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సాధువులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా హాజరుకానున్నారని రామ్ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. ఈ వేడుకకు 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మంది హిందూ మత పెద్దలను ఆహ్వానించాలని ట్రస్ట్ యోచిస్తోంది. సాధువుల జాబితాను ఆలయ ట్రస్ట్ సిద్ధం చేస్తుందని, త్వరలో వారికి ఆహ్వాన పత్రాన్ని పంపనున్నట్లు ఆయన తెలిపారు. వీరందరికీ అయోధ్యలోని పెద్ద మఠాలలో వసతి కల్పించాలని ట్రస్ట్ ప్లాన్ భావిస్తుందని అని రాయ్ చెప్పారు.రామజన్మభూమి ఆవరణలో జరిగే పవిత్రోత్సవ కార్యక్రమానికి హాజయ్యే 25 వేల మంది సాధువులు, పది వేల మంది ప్రముఖులకు ప్రత్యేక విడిది ఏర్పాటు చేస్తామన్నారు. కాగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలయ భూమి పూజ కార్యక్రమం 2020, ఆగస్టు 5న నిడారంబరంగా జరిపించామన్నారు.రాంలాలా గర్భగుడి ముగింపు దశకు చేరుకుందని, జనవరి నెలలో ‘ప్రాణ్ ప్రతిష్ఠ’కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. అయోధ్యలో జరిగే పవిత్రాభిషేక మహోత్సవానికి విచ్చేసే భక్తులకు దాదాపు నెల రోజుల పాటు ఉచిత భోజనం అందించాలని ట్రస్టు యోచిస్తోంది. ప్రతిరోజూ 75 వేల నుంచి లక్ష మంది వరకు అన్నదానం చేసే అవకాశం ఉందని ట్రస్ట్‌ పేర్కొంది.