అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370(Article 370) రద్దుకు శనివారానికి నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ యాత్రను ఆగస్టు 5న రద్దు చేస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. శుక్రవారం జమ్మూలోని బేస్‌క్యాంప్ నుంచి 1,181 మంది యాత్రికులు 33వ బ్యాచ్ బయల్దేరి దక్షిణ హిమాలయాల్లోని అమర్‌నాథ్ క్షేత్రానికి భారీ భద్రత మధ్య వెళ్లినట్టు అధికారులు తెలిపారు. జులై 1 నుంచి కొనసాగుతోన్న ఈ యాత్రలో ఇప్పటివరకు 4.5లక్షల మందికి పైగా భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకున్నారని వెల్లడించారు. అయితే, ఆగస్టు 5తో ఆర్టికల్ 370 రద్దై నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా భద్రతను పెంచినట్టు పేర్కొన్నారు.