Devotional

దొంగతనం చేసిన పూలతో పూజించకూడదు

దొంగతనం చేసిన పూలతో పూజించకూడదు

పూజలో పూలు వాడటం తప్పనిసరి.. ఒక్కోక్కరు ఒక్కో రకమైన పూలతో పూజ చేస్తారు.. అయితే దేవుడి పూజ కోసం పూలను బయట మార్కెట్ లో లేదంటే బయట పెరట్లో గార్డెన్లో పూసిన పువ్వులను లేదంటే పక్కింట్లో పూలు ఉంటే వాటిని అడిగి కోసుకొని వచ్చి పూజలు చేయడం లాంటివి చేస్తుంటాము.. ఎవరైతే భక్తి పూర్వకంగా, పవిత్రమైన మనస్సుతో.. పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దేవుడు తృప్తిగా స్వీకరిస్తారని చెబుతారు. చాలామంది తెలియకుండా దొంగ చాటుగా పూలు కోసుకొని దేవుడికి అలంకరిస్తారు.

అయితే అవతలి వాళ్ళు వద్దంటే చాలు గుర్రున చూడటం మాత్రమే కాదు. వీళ్లకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటూ మనసులో తిట్టుకుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. పూల మొక్క పై దండయాత్ర చెయ్యడం కాదు.. అన్ని పూలు కోసుకోకుండా కొన్ని పూలను ఉంచాలట.. అలా లేకుంటే మహా పాపం అని నిపుణులు చెబుతున్నారు.పూలుకోసుకున్నప్పడు కూడా ఇంటి యజమానిని అడగాలి. అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్లిపోతుంది. ఈ విషయాలు గరుడపురాణంలో ఉంటాయి. అలాగే తాంబూలం, పండ్లు, పూలు వాటిని దొంగతనం చేసినవారు అడవిలో కోతిలా పుడతారు.. చెప్పులు, గడ్డి, ప్రత్తి దొంగతనం చేసినవారు మరు జన్మలో మేకలా పుడతారు.యజమానుల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూటగట్టుకున్నట్లు అవుతుంది. పూలు కోసుకురావడం తప్పుకాదు కానీ ఆ ఇంటి యజమానికి అడగకుండా కోసుకోవడం తప్పు. ఇక కొందరైతే ఏకంగా చెట్టుకి ఒక్క పువ్వు కూడా ఉంచకుండా మొత్తం చెట్లో ఉన్న పూలన్నీ కోసేస్తూ ఉంటారు. అలా చేయడం మరింత పాపం.. అందుకే పక్కింట్లో కొయ్యడం కన్నా కొనుక్కోవడం మంచిది.. ఇది అస్సలు మర్చిపోకండి..