Politics

మంగళగిరి కోర్టుకు హాజరైన లోకేశ్

మంగళగిరి కోర్టుకు హాజరైన లోకేశ్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. వైకాపా నేతలపై వేసిన పరువునష్టం దావా విషయంలో స్థానిక మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు వచ్చారు. ఆయన వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ నమోదు చేయనున్నారు. లోకేశ్‌ కోర్టుకు వస్తున్న విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధతో పాటు పలువురు నేతలు లోకేశ్‌ను కలిశారు.