Politics

జనసేన నేతలకు క్లాస్‌ పీకిన పవన్‌

జనసేన నేతలకు క్లాస్‌ పీకిన పవన్‌

జనసేన నేతలకు క్లాస్‌ తీసుకున్నారు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాయలంలో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశం వేదికగా పార్టీ నేతలకు సున్నితంగా చురకలు అంటించారు పవన్‌.. నా చుట్టూ తిరిగితే నాయకులు అవరన్న ఆయన.. కలిసిన వారినే కలవటం అంటే నాకు సమయం వృథా అని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే మాత్రమే లీడర్స్ అవుతారని స్పష్టం చేసిన ఆయన.. ప్రతి విషయానికి నేనే రావాలని కాదు.. మీరు రెస్పాండ్ అవ్వాలి.. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, త్రికరణ శుద్ధిగా పనిచేయండి.. ప్రతి పక్ష పార్టీపై మనం పోరాటం చేయాలి.. తప్ప మన పక్కనే ఉన్న వాళ్లని ఇబ్బంది పెట్టడం సరికాదని హితవుపలికారు.ఇక, విశాఖలో జరగనున్న వారాహి విజయ యాత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని సూచించారు పవన్‌ కల్యాణ్.. విశాఖలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదన్న ఆయన.. విశాఖ ఎంపీని చితక్కొట్టి నా పోలీస్ వ్యవస్థ చూస్తూ ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఖాళీ జాగాలు, కొండలు కనపడకూడదు అనే విధంగా విశాఖ పరిస్థితి ఉందన్నారు పవన్‌. మరోవైపు.. బ్రో సినిమాలో ఓ క్యారెక్టర్‌పై జనసేన వర్సెస్‌ వైసీపీగా మాటల యుద్ధం నడుస్తోంది.. ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబు ఈ సినిమాపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు.. ఆ అంశాలపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. టీవీ డిబేట్స్ లో మహిళల అదృశ్యం, పోలవరం, చిన్నారుల ట్రాఫికింగ్.. ఇల అంశాలపై నేతలు మాట్లాడాలి.. కానీ, సినిమా గురించి, నన్ను తిట్టడం గురించి చర్చలు ఎందుకు? వాటిపై పార్టీ నేతలు డిబేట్స్ ఎందుకు అని ప్రశ్నించారు. నన్ను తిట్టినా నాకు ఏం కాదు.. నేనే ఆ సినిమా గురించి వదిలేశాను.. వాళ్లు కావాలని డైవర్ట్ చేస్తే మీరు కూడా మళ్లీ దానిపై మాట్లాడటం సరికాదని సూచించారు. సినిమాను నేతలు రాజకీయాల్లోకి తీసుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.