గాయం నుంచి కోలుకొని కోర్టులో అడుగుపెట్టిన అనంతరం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మునుపటి జోరు కనబర్చ లేకపోతున్నది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో శుక్రవారం సింధు 12-21, 17-21తో బివెన్ జాంగ్ చేతిలో పరాజయం పాలైంది. హెచ్ఎస్ ప్రణయ్ 16-21, 21-17, 21-14తో ఆంటోనిపై గెలుపొందాడు. మరో క్వార్టర్స్ పోరులో ప్రియాన్షు రజావత్ 21-13, 21-8తో భారత్‌కే చెందిన శ్రీకాంత్‌పై గెలుపొందాడు. సెమీస్‌లో ప్రియాన్షుతో ప్రణయ్ తలపడనున్నాడు.
ఓడిన సింధు
Related tags :