Food

నేడు అంతర్జాతీయ బీర్ దినోత్సవం

నేడు అంతర్జాతీయ బీర్ దినోత్సవం

అంతర్జాతీయ బీర్ డే.. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం జరిగే వేడుక. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీర్ ప్రియులను ఒకచోట చేర్చే గ్లోబల్ ఈవెంట్. ఈ రోజు బీర్ పట్ల వారి ప్రేమ ద్వారా ప్రజలను ఏకం చేయడం, బాధ్యతాయుతమైన మద్యపానాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వేడుకలో బీర్ ప్రియులు ఒకచోట చేరి కొత్త బీర్లను ప్రయత్నిస్తూ..ఇష్టమైన రకాలను స్నేహితులు, అపరిచితులతో పంచుకుంటారు.

అతి పురాతన చరిత్రగల ఈ పానీయం తాగుతూ రోజంతా ప్రజలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంజాయ్ చేస్తారు. బ్రూయింగ్ ప్రక్రియలో ప్రజలు వివిధ రకాల బీర్లను రుచి చూడడం..స్థానిక లేదా అంతర్జాతీయ బీర్ రకాలను ప్రయత్నించడానికి ఇది ఒక అవకాశం.

ఇంటర్నేషనల్ బీర్ డే చరిత్ర
అంతర్జాతీయ బీర్ల దినోత్సవాన్ని మొదట కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్ లో జెస్పీ అవ్ షలోమోవ్స్ లో జరుపుకున్నారు. ప్రారంభంలో ఆగస్టు 5 న జరుపుకున్నారు. తరువాత ఆగస్టు మొదటి శుక్రవారం ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ రోజు బీర్‌ను ఆస్వాదించడమే కాకుండా స్థానికంగా ఉండే బీర్ల కంపెనీలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందంటున్నారు బీర్ ప్రియులు.