2020 ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన అల్లర్ల కేసుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) కోర్టుకు హాజరయ్యారు. ఆ కేసుల్లో తాను నిర్దోషిని అని ఆయన కోర్టు తెలిపారు. కోర్టు విచారణ సమయంలో తన పేరు, వయసు ఆయన చెప్పుకున్నారు. గడిచిన నాలుగు నెలల్లో ఆయన కోర్టుకు హాజరుకావడం ఇది మూడవసారి. కోర్టు వెనుక ఉన్న డోరు నుంచి ఆయన హాల్‌లోకి ఎంటర్ అయ్యారు. 2021 జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన కేసుల్లో ట్రంప్ విచారణ ఎదుర్కొంటున్నారు.
విచారణ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్థులు తనను ఆ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మొత్తం నాలుగు కేసుల్లో ట్రంప్‌పై విచారణ జరగుతోంది. మెజిస్ట్రేట్ జడ్జి మోక్సిలా ఉపాధ్యాయా ఈ కేసును విచారిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ కోర్టుహౌజ్‌లో ట్రంప్ కాసేపు గడిపారు. ఈ కేసుతో లింకున్న సాక్ష్యులతో మాట్లాడవద్దు అని ట్రంప్‌కు కోర్టు ఆదేశించింది. ఆగస్టు 28వ తేదీన ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టనున్నారు.