Politics

చంద్రబాబు రోడ్ షోను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు

చంద్రబాబు రోడ్ షోను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు

అన్నమయ్య జిల్లా కురబలకోటలో ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. మండలంలోని అంగళ్లు కూడలిలో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోను వైసీపీ నేతలు , కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. దీనిపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.