Movies

చంద్రముఖి ఫస్ట్ లుక్ ​పోస్టర్​ రిలీజ్

చంద్రముఖి ఫస్ట్ లుక్ ​పోస్టర్​ రిలీజ్

రాఘవ లారెన్స్(Raghava Lawrence) మోస్ట్ ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ చంద్రముఖి 2(Chandramukhi 2). పి వాసు(p Vasu) డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి కంగనా రనౌత్(Kangana Ranaut) ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందం, అభినయంతో ఉన్న కంగనా లుక్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుటుంది. కంగనా తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తారని యూనిట్ పేర్కోంది. రజినీ చంద్రముఖి క్యారెక్టర్ లో జ్యోతిక నటనకు ఆడియన్స్ ఎంతో ఫిదా అవ్వగా..ఆమె తనలోని అగ్రీసీవ్ యాక్టింగ్ తో అందరినీ భయపెట్టింది కూడా. ఇపుడు లేటెస్ట్ గా రిలీజ్ అయినా కంగనా ఫస్ట్ లుక్ పోస్టర్ లో చాలా కూల్ గా ఉండటంతో.. చంద్రముఖి ఇంత కూల్ గా కనిపిస్తుందంటే, మరి మూవీలో ఎంతలా భయపెడుతుందో అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కంగనా తను వెడ్స్ మను, మణికర్ణిక, క్రిష్ 3, క్వీన్, తలైవి వంటి మూవీస్ తో తనలోని ఐకానిక్ యాక్టింగ్ తో గుర్తింపు పొందింది.

ఇప్పటికే రిలీజైన లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై భిన్నమైన కామెంట్స్ వినపడుతున్నాయి. లారెన్స్ రాజు గెటప్ లో.. రాజసం ఉట్టిపడేలా లుక్స్, మ్యానరిజమ్స్ ఉన్న..రజినీకాంత్ లా మాత్రం ఆకట్టుకోలేకపోయారు అనే కామెంట్స్ వినపడుతున్నాయి. దాదాపు 17ఏళ్ల తర్వాత చంద్రముఖి మూవీకు సీక్వెల్‌ తెరకెక్కుతుండటం విశేషం. గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సినిమాను 2023 సెప్టెంబర్ 19న రిలీజ్ చేయనున్నారు.తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు విన్నర్‌, లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కంగనా రనౌత్, వడివేలు, రాధిక శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.