WorldWonders

చంద్రయాన్‌-3లో నేడు కీలక పరిణామం…రాత్రి 7 గంటలకు అద్భుత ఘట్టం

చంద్రయాన్‌-3లో నేడు కీలక పరిణామం…రాత్రి 7 గంటలకు అద్భుత ఘట్టం

భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-3లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోనికి ప్రవేశించనుంది. చంద్రయాన్-3 ఇప్పటికే జాబిల్లి దిశగా అత్యధిక దూరం పయనించింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఇది చంద్రుని కక్ష్యలో ప్రవేశించనుందని ఇస్రో ప్రకటన విడుదల చేసింది. స్పేస్ క్రాఫ్ట్ లోని విక్రమ్ ల్యాండర్‌కు అన్నీ అనుకూలిస్తే …ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగతుందని ఇస్రో అంచనా వేస్తోంది. చంద్రుడిపై దిగే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని చెప్పారు సైంటిస్టులు. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ కు ప్రధానమైన తేడా ఉందన్నారు. గతంలో ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు మూగబోయాయి. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా, విక్రమ్ ల్యాండర్ ను మరింత అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

చంద్రయాన్‌-3ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆతర్వాత రోజే తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు సైంటిస్టులు. భూకక్ష్య పూర్తయినతర్వాత ఆగస్టు 1న ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో చంద్రయాన్‌-3 ప్రస్తుతం చంద్రుడి దిశగా వెళ్తుంది. ఇవాళ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.చంద్రయాన్​-3 ల్యాండర్​స్మూత్తుగా చంద్రుడి ఉపరితలంపై దిగితే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా రికార్డుకెక్కుతుంది భారత్. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఇస్రో 613 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇక చంద్రయాన్‌-3 బరువు 3వేల 900 కిలోలు కాగా.. అందులో ల్యాండర్‌, రోవర్‌ బరువు 1752 కిలోలు