NRI-NRT

ఆరోగ్య తెలంగాణ పట్ల NRI BRS హర్షం

ఆరోగ్య తెలంగాణ పట్ల NRI BRS హర్షం

స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ, వైద్యారోగ్య రంగ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన కార్యక్రమాలు, పథకాలను చేపట్టిందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ప్ర‌శంసించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ ‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా అడుగులు వేస్తున్నదని హర్షం వ్యక్తం చేసింది.

మెల్‌బోర్న్‌లో విశ్వామిత్ర మంత్రి ప్రగడ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, గుణాత్మక ప్రగతి కార్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు రైతు రుణమాఫీ నిర్ణయానికి రైతుల తరపున, ప్రజల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రైతు సంక్షేమం, ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు అలాగే రైతు రుణమాఫీతో పాటు హైదరాబాద్‌లో మెట్రోరైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ నిర్ణయం, తదితర అభివృద్ధి, సంక్షేమ నిర్ణయాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు, రైతు కుటుంబాలన్నీ సంబరాలు జరుపుకుంటున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ, రైతు పక్షపాతిగా మరోసారి నిలిచిందన్నారు. రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్ మరోసారి నిలిచారని కొనియాడారు.ఈ సమావేశంలో అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, ఉప్పు సాయిరాం, విశ్వామిత్ర, వినయ్ గౌడ్, సురేష్, ఉదయ్, జమాల్, సాయి యాదవ్, వేణు, సతీష్, రాకేష్, సూర్య తదితరులు పాల్గొన్నారు.