Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

ఈ వారం మీ రాశి ఫలితాలు

హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (06-08-2023 నుండి 12-08-2023) ✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు

🐐 మేషం (06-08-2023 నుండి 12-08-2023)

ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు . ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. మీ రంగాల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. అధికారుల వైఖరి మీపట్ల మిశ్రమంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచి ఫలితాలు పొందుతారు.

🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం (06-08-2023 నుండి 12-08-2023)

అదృష్టసిద్ధి ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదురుతుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. భూసంబంధ వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్తపనులను ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలుపెట్టండి. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఇష్టదేవతా స్తోత్రం పఠించడం మంచిది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం (06-08-2023 నుండి 12-08-2023)

వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలుంటాయి . . పట్టువదలకుండా పనిచేయాలి. మీ ప్రజ్ఞా శక్తితో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఉన్నది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ధనలాభం కలదు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు. మనోబలం సదా రక్షిస్తుంది. ఎట్టిపరిస్తుతుల్లోనూ ఓర్పును కోల్పోరాదు. విష్ణు సందర్శనం శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం (06-08-2023 నుండి 12-08-2023)

మీ రంగాల్లో మంచి ఫలితాలున్నాయి . ఆర్థికలాభాలున్నాయి. అధికారుల ప్రశంసలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మశక్తితో ముందుకు సాగండి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగంలో వారికి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమయ్యే సూచన ఉంది. కొన్ని సందర్భాల్లో ఒక మెట్టుదిగి వ్యవహరించడంవల్ల అనుకూలఫలితాలు సిద్ధిస్తాయి. జ్ఞానం వృద్ధి చెందుతుంది . ఈశ్వర స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం  (06-08-2023 నుండి 12-08-2023)

శుభఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలలో మీరు ఆశించే ఫలితాలు వస్తాయి. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మిత్రుల సలహాలు మేలుచేస్తాయి . మీరు ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కీలక వాదనలు, వ్యవహారాలు ఓకొలిక్కి వస్తాయి. కార్యక్రమ ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త. ఆత్మీయుల సలహాలు తీసుకోండి. ఇష్టదేవతా అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య (06-08-2023 నుండి 12-08-2023)

యశోవృద్ధి ఉంది . అనుకున్న పనులను సక్రమంగా పూర్తిచేస్తారు. మిత్రుల సహకారంతో లక్ష్యాలకు చేరువవుతారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనుల్లో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో బంధుమిత్రులను కలుపుకుపోవడం మంచినిస్తుంది. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మేలు. వారాంతంలో మంచి వార్తను వింటారు . ఇష్టదేవతా ఆరాధన శక్తినిస్తుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల (06-08-2023 నుండి 12-08-2023)

వ్యాపారాల్లో ఆర్థికంగా లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. మొదలు పెట్టిన పనులను సత్భావంతో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సహకారం ఉంటుంది. తలపెట్టిన పనిలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. పెద్దల సహకారం ఉంటుంది. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు. అభివృద్ధికి సంబంధించిన పనుల్లో తొందరపాటు పనికిరాదు. లక్ష్మీసహస్రనామపారాయణ శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం (06-08-2023 నుండి 12-08-2023)

మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగండి మంచి చేకూరుతుంది. అనుకున్నది సాధించేవరకు పట్టుదల వదలకండి. సంతృప్తికరమైన ఫలితాలు సొంతమవుతాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృధాచేయకండి. వివాదాలకు ఆమడ దూరంలో ఉండాలి. దైవబలం మీ వెన్నంటే ఉండి కాపాడుతుంది. వారాంతంలో ఒక వార్త మానసిక ఉత్సాహాన్ని పెంచేవిధంగా ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు (06-08-2023 నుండి 12-08-2023)

ఆర్థికంగా కలిసి వస్తుంది. మంచి ఫలితాలను అందుకుంటారు. శక్తివంచన లేకుండా పనిచేయాలి. ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన తరువాత ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటారు. వారాంతంలో శుభఫలితాలున్నాయి. మన ప్రక్కనే ఉండిఇబ్బంది పెట్టేవారు, తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. వారం మధ్యలో ఒక వార్త ఇబ్బంది పెడుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తోటి వారికీ మేలుచేయాలంటే గుణం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి ఉత్తమఫలితాన్ని ఇస్తుంది
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం (06-08-2023 నుండి 12-08-2023)

గతంలో కంటే మంచి కాలం. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు లాభిస్తాయి. పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని పనులను పూర్తి చేయగలుగుతున్నారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురికాకండి. నవగ్రహ శ్లోకాలు శుభప్రదం .

🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం (06-08-2023 నుండి 12-08-2023)

శుభ భవిష్యత్తు ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనిలో మరింత శ్రద్ధగా పనిచేయాలి . ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. విందు, వినోద, కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు. కుటుంబ సభ్యుల ఆలోచనలకు విలువనివ్వడం వలన మీకు సమస్యలు తగ్గుతాయి. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. శత్రుపీడ తొలగుతుంది. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం (06-08-2023 నుండి 12-08-2023)

విశేషమైన శుభఫలితాలు ఉన్నాయి. మీ రంగాల్లో అప్పగించిన భాద్యతలను మీకు సరిగ్గా పూర్తిచేస్తారు. ఆస్తి విలువను పెంచేవిధంగా మీ ఆలోచనావిధానం ఉంటుంది. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు అందుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అధికార లాభం ఉన్నది. ఆధ్యాత్మిక సంపదను పెంచండి. ఇష్టదేవత ఆరాధన చేస్తే మంచిది.

🦈🦈🦈🦈🦈🦈🦈