‘‘కేవలం స్టార్స్ మాత్రమే ఉన్న ఇండస్ట్రీలోకి బిక్కుబిక్కుమనుకుంటూ ప్రవేశించా. కానీ, ఇక్కడ రాణిస్తాననే నమ్మకం గట్టిగా ఉండేది. ‘కొత్త అల్లుడు’లో ఓ చిన్న పాత్ర పోషించమన్నారు. బాధతోనే నటించా. ‘కొత్తపేట రౌడీ’లో కృష్ణగారి పక్కన చిన్న వేషం వెయ్యవయ్యా’ అని అనేవారు. ఓ వైపు నేను ‘ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య’, ‘శుభలేఖ’ చేస్తున్నానని, వేరే సినిమాల్లో చిన్న పాత్రలు పోషిస్తే బాగోదేమోనన్న సందేహం వెలిబుచ్చా. ‘చేయండి సర్’ అంటూ గంభీర స్వరంతో సమాధానమిచ్చేవారు. చెయ్యను అని చెబితే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోననే భయంతో చేశా. నన్ను ప్రోత్సహించి, భుజానికెత్తుకుంది ప్రేక్షకులు. ఇండస్ట్రీకి చెందిన వారు నాకు సెకండరీ’’ అని భావోద్వేగంగా మాట్లాడారు చిరంజీవి.
చిరంజీవికి కూడా భవిష్యత్తుపైన భయం ఉండేది
Related tags :