NRI-NRT

వాషింగ్టన్ లో కాల్పులు

వాషింగ్టన్ లో కాల్పులు

అమెరికాలో తుపాకి మోత మళ్లీ మోగింది. రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన మాస్ షూటింగ్‌లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. ఆగ్నేయ వాషింగ్టన్‌లోని అనకోస్టియా ప్రాంతంలో జరిగిందీ ఘటన.
ఈ ఏడాది ఇక్కడ 150కిపైగా హత్యలు జరిగాయి. గత రెండు దశాబ్దాలతో పోలిస్తే ఇదే అత్యధికం. పోలీసులు దీనిని మతిలేని హింసాత్మక చర్యగా పేర్కొన్నారు. కాగా, ఈ నెలలో ఇప్పటి వరకు ఐదుగురు కాల్పులకు బలైనట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది.