తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం శ్రీరంగం ఆలయ గోపురంలోని కొంతభాగం కూలిపోయింది. తూర్పు ద్వారం వద్ద ఉన్న గోపురం శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కూలింది. అర్ధరాత్రి కావడంతో ప్రమాదం తప్పింది. శనివారం అధికారులు శిథిలాలను తొలగించి, పునరుద్ధరణ పనులను చేపట్టారు.గోపురంపై పగుళ్లు వచ్చాయని గతంలోనే ఫిర్యాదు చేసినా ఆలయ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. కాగా, ఇటీవల రూ.98 లక్షల అంచనా వ్యయంతో పునరుద్ధరణ పనులకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.