Business

డెలివరీ బాయ్‌గా జొమాటో సీఈఓ-TNI నేటి వాణిజ్య వార్తలు

డెలివరీ బాయ్‌గా జొమాటో సీఈఓ-TNI నేటి వాణిజ్య వార్తలు

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర సర్కారు ఉద్యోగులకు తీపి కబురు అందించనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని సుమారు 3 శాతం వరకు పెంచనుంది. ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏని 45 శాతం చేయనుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతుంటాయి. కరువు భత్యాన్ని పెంచేందుకు కార్మిక శాఖ ప్రతి నెలా విడుదల చేసే వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను సర్కారు పరిగణనలోకి తీసుకుంటుంది.తాము అయితే 4 శాతం డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ్ గోపాల్ మిశ్రా పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం 3 శాతం పెంచి 45 శాతానికి చేర్చే అవకాశం ఉన్నట్టు చెప్పారు. డీఏ పెంచితే జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయం సుమారు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. కేంద్ర సర్కారు చివరి విడత ఈ ఏడాది మార్చి 24న డీఏని పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. దీన్ని 2023 జనవరి 1 నుంచి అమలు చేసింది. పెరిగే ధరలకు పరిహారంగా డీఏ రూపంలో ఎప్పటికప్పుడు ఈ ప్రయోజనాన్ని ప్రభుత్వాలు అందిస్తుంటాయి. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రాలు అనుసరిస్తుంటాయి.

డెలివరీ బాయ్‌గా జొమాటో సీఈఓ

జొమాటో సీఈఓ (జొమాటో) దీపిందర్ గోయల్ (దీపిందర్ గోయల్) ఫ్రెండ్‌షిప్ డే (ఫ్రెండ్‌షిప్ డే)ని వినయంగా చేసుకొంటున్నారు. ఎంచక్కా సాధారణ డెలివరీ బాయ్‌ వలే రెడ్‌ టీ షర్ట్‌ ధరించి.. బైక్‌పై ఫుడ్‌ డెలివరీలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.జొమాటో సీఈఓ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై టీ షర్టు ధరించి కస్టమర్లకు ఆహారం అందిచటానికి బయల్దేరారు. అతని చేతిలో ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కూడా ఉన్నాయి. డెలివరీ పార్ట్‌నర్లు, కస్టమర్లు, రెస్టారెంట్‌ పార్ట్‌నర్‌లకు కూడా ఈ బ్యాండ్‌లు అందించబడతాయి. కంపెనీతో అనుబంధం ఉన్న వారితో కలిసి ఈ రోజు ఆయన ‘స్నేహితుల దినోత్సవాన్ని’ చేసుకోనున్నారు.రెస్టారెంట్లు, ఆహారంతో పాటూ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లను అందించబోతున్నాం. ఇది నాకు ప్రత్యేకమైన ఆదివారం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సీఈఓను పొగొడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘ఇది బెస్ట్‌ ఫ్రెండ్‌షిప్ డే సంబరాలు’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. 

*   వాహనదారులకు గుడ్ న్యూస్

ఉత్తర ప్రదేశ్ లోని పాత కార్లు, ద్విచక్ర వాహనాల యజమానులకు శుభవార్త. ఉత్తరప్రదేశ్‌లో పాత కార్లు, బైక్‌ల రీ-రిజిస్ట్రేషన్‌పై గ్రీన్ ట్యాక్స్ వర్తించదు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌పై గ్రీన్ ట్యాక్స్ విధించే ప్రతిపాదనను తిరస్కరించింది. అంటే వాహనాలు 15 ఏళ్ల వ్యవధిని పూర్తి చేసుకోనున్న వాహన యజమానులకు ఇది శుభవార్త. పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌పై 2 శాతం గ్రీన్ ట్యాక్స్ వసూలు చేయాలని రవాణా శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీన్ని ఇప్పుడు ప్రభుత్వం తిరస్కరించింది.రవాణాశాఖ పంపిన ప్రతిపాదన ఆమోదం పొందితే బైక్‌ డ్రైవర్లకు రూ.600, కార్ల యజమానులకు రూ.2వేలు పెరిగినట్లు ప్రభుత్వ శాఖ నుంచి అందిన సమాచారం. ఇప్పుడు మునుపటిలా పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్ సాధారణ నిర్ణీత మొత్తంలో సులభంగా చేయబడుతుంది. అలాంటి వాహనాల యజమానులు పెద్దగా జేబును ఖాళీ చేసుకోవాల్సిన పనిలేదు.గ్రీన్ టాక్స్ ను కాలుష్య పన్ను లేదా పర్యావరణ పన్ను అని కూడా పిలుస్తారు. కాలుష్యానికి కారణమయ్యే వస్తువులపై పన్ను విధించడం ద్వారా ప్రభుత్వాలు వసూలు చేసే ఎక్సైజ్ సుంకం.ఇప్పటికే 8 సంవత్సరాల కంటే పాత వాణిజ్య వాహనాలకు గ్రీన్ టాక్స్ వర్తిస్తుంది. కానీ తరువాత ఇది 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రైవేట్ వాహనాలకు కూడా విస్తరించబడింది.

యాపిల్ సిడార్ వెనిగర్

యాపిల్ సిడార్ వెనిగర్ గురించి వినే ఉంటారు. ఇటీవలి కాలంలో నలుగురి నోళ్లలో నానుతున్న దీని గురించి గతంలో ఎక్కువ మందికి అవగాహన ఉండేది కాదు. కానీ స్మార్ట్ ఫోన్ల వల్ల ఇప్పుడిప్పుడే దీని ప్రయోజనాలు తెలిసి వస్తున్నాయి.యాపిల్ సిడార్ వెనిగర్ అంటే..? ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం) విధానంలో దీన్ని తయారు చేస్తారు. చిదిమేసిన యాపిల్ గుజ్జును ఎసిటిక్ యాసిడ్ గా మారుస్తారు. ఇందుకు ఈస్ట్, షుగర్ ను వాడతారు. ఎసిటిక్ యాసిడ్ తో మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యం కోసం అయితే ‘యాపిల్ సిడార్ వెనిగర్ రా అన్ ఫిల్టర్డ్ మథర్’ తీసుకోవాలి. మథర్ అంటే బ్యాక్టీరియా, ఈస్ట్ తో చేసిందని అర్థం. అంటే అందులో ఉండే ప్రో బయాటిక్స్ పేగులకు ఆరోగ్యాన్నిస్తాయి.నిజానికి యాపిల్ సిడార్ వెనిగర్ వినియోగం వందల సంవత్సరాలుగా ఉంది. కాకపోతే మన దేశంలోనే అంతగా తెలియదు. ఏసీవీ మథర్ లో ఉండే ప్రోబయాటిక్ పేగుల ఆరోగ్యానికి సాయం చేయడం వల్ల ఎన్నో జీవక్రియలకు మేలు జరుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. తిన్నది మంచిగా జీర్ణం అవుతుంది. బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెకు రక్షణ పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. చర్మం కాంతిగా మారుతుంది. చర్మంపై మొటిమల సమస్య తగ్గుతుంది. రోజూ ఒకటి లేదా రెండు టీ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ రా మథర్ ను 15-30 ఎంఎల్ నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. భోజనానికి ముందు లేదా భోజనం తర్వాత అయినా తీసుకోవచ్చు. ఈ రెండింటినీ చూసి, ఏ విధంగా ఎక్కువ ప్రయోజనం ఉంటే ఆ విధానాన్ని అనుసరించాలి. ప్లాస్టిక్ బాటిల్ లో కాకుండా, గాజు బాటిల్ లో ఉన్నది అయితే మంచిది.

*  టమాటా అమ్మి కోటీశ్వరుడయ్యాడు

టమాటా ధరలు సామాన్య ప్రజలను కంటతడి పెట్టించగా.. కొంతమంది రైతులను మాత్రం ధనవంతులను చేసింది. కేవలం రెండు నెలల్లో చాలా మంది రైతులు టమాటాలు అమ్మి కోటీశ్వరులు అయ్యారు. ప్రస్తుతం టమాటా ధరలు కిలో 250 నుంచి 300 రూపాయలకు చేరుకున్నాయి. దీంతో చాలా మంది రైతుల ఆదాయం కోట్లకు చేరింది. కరోడ్‌పతి క్లబ్‌లో చేరిన తర్వాత రైతులు తమ ఇళ్ల నుంచి ట్రాక్టర్లు, కార్ల వరకు అన్నీ కొనుగోలు చేశారు. అటువంటి పరిస్థితిలో విపరీతమైన ప్రయోజనాల కారణంగా 2023 సంవత్సరాన్ని రైతులు ఎప్పటికీ మరచిపోలేరు.తాజాగా తెలంగాణ రాష్ట్రం పులమామిడిలో నివాసముంటున్న కె అనంత్ రెడ్డి టమాటా విక్రయిస్తూ కొత్త ట్రాక్టర్, హ్యుందాయ్ వెన్యూ కారు కొనుగోలు చేశారు. ఈ కారు ధర లక్షల్లో ఉంటుంది. ఈ ఏడాది ఎకరాకు రూ.20లక్షలు అధిక ధరతో టమాటా పండించిందని రైతు తెలిపాడు. కర్ణాటకలోని తలబిగపల్లికి చెందిన 35 ఏళ్ల అరవింద్ టమాటాల ద్వారా వచ్చిన ఆదాయంతో రూ.1.4 కోట్లు సంపాదించాడు. ఈసారి ఐదెకరాల భూమిలో టమాటా సాగు చేశాడు. ఈ సంపాదనతో తల్లి కోసం ఓ విలాసవంతమైన ఇల్లు కొన్నారు. అరవింద్ ఈ ఏడాది టమాటా అమ్మడం ద్వారా రూ.3 కోట్లు సంపాదించాడు.టమాటా పంట తరచుగా రైతులకు నష్టాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు వర్షం కారణంగా.. కొన్నిసార్లు ఎండల కారణంగా టమాటా పంట నాశనమవుతుంది. ఈ ఏడాది కూడా వర్షాలు, ఎండలకు పలుచోట్ల పంట నాశనమైంది. ఈలోగా పంటను కాపాడిన వారు ధనవంతులయ్యారు. అరపాటి నరసింహా రెడ్డి మాట్లాడుతూ ఇంతకు ముందు క్యారెట్, టమాటా రూ.40 లేదా 50లకు అమ్ముడయ్యేది. దీని వల్ల వారికి ప్రత్యేక లాభం ఏమీ రాలేదు. కానీ ఈ ఏడాది క్యారెట్ 2000 నుంచి 2500 రూపాయలకు విక్రయిస్తున్నారు.నరసింహులు ఈసారి 10 ఎకరాల్లో టమాటా వేశాడు. అధిక ధర కారణంగా ఈసారి అతని క్యారెట్ రూ.4000కు విక్రయించారు. నరసింహతో పాటు ఆయన గ్రామానికి చెందిన 150 మంది రైతులు టమోటాలు అమ్మి రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు సంపాదించారు. కర్ణాటకలోని పాళ్య గ్రామానికి చెందిన సీతారాంరెడ్డి గత నెలన్నర వ్యవధిలో రూ.50 లక్షలు సంపాదించాడు. ఈ సంపాదనతో గతేడాది తన రుణాన్ని చెల్లించాడు.

టీ-హబ్​లో కెరీర్ గ్రోత్ సమ్మిట్

ఫ్రంట్ లైన్స్ మీడియా (ఎఫ్ఎల్ఎమ్) ఏర్పాటు చేసిన  కెరీర్ గ్రోత్ సమ్మిట్ శనివారం హైదరాబాద్‌‌‌‌లోని టీ–హబ్​లో జరిగింది. ఈ సందర్భంగా స్టూడెంట్లు కెరీర్ ​గురించి అడిగిన ప్రశ్నలకు కెరీర్ కోచ్‌‌‌‌లు జవాబులు ఇచ్చారు. దాదాపు 300 మంది స్టూడెంట్లు,  కెరీర్ కోచ్‌‌‌‌లు సమ్మిట్‌‌‌‌లో పాల్గొన్నారు. క్రైసిస్​ సమయంలో కెరీర్‌‌‌‌ను ఎలా నిర్మించుకోవాలి?, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, కొత్త అవకాశాలు తదితర అంశాల గురించి వివరించారు.ఫ్రంట్ లైన్స్ మీడియా ఫౌండర్లు సాయికృష్ణ మంత్రవాది, ఉపేంద్ర గులిపిల్లి మాట్లాడుతూ నిరుద్యోగులకు, స్టూడెంట్లకు కెరీర్​,  ఉద్యోగ అవకాశాల గురించి తెలియజే యడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తామని తెలిపారు. ఫ్రంట్‌‌‌‌లైన్ మీడియాకు ఇప్పుడు ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో   కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారని తెలిపారు. తెలుగులోనూ ట్రెండింగ్ టెక్నాలజీలన్నింటినీ వివరిస్తామని చెప్పారు.

*   ల్యాప్‌టాప్‌ దిగుమతులపై ఆంక్షలు వాయిదా

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌ల(ట్యాబ్లెట్ కంప్యూటర్‌లతో కలిపి) దిగుమతులపై విధించిన ఆంక్షలు నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) నమోదు. ఆయా పరికరాల్లో భద్రతా లోపాలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకూ ఇది ఉపకరిస్తుంది. తక్షణమే ఈ ఆశలు అమల్లోకి వస్తాయని ప్రారంభంలో పరిశ్రమ వర్గాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి, కొత్త విధానం అమలును అక్టోబరు 31 వరకు నిలిపివేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘లైసెన్స్‌ లేకుండానే దిగుమతుల్ని 2023 అక్టోబరు 31 వరకు అనుమతిస్తాం’ అని అందులో పేర్కొన్నారు. నవంబరు 1 నుంచి లైసెన్స్‌ ఉంటేనే ల్యాప్‌టాప్‌లు దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, సర్వర్ల దిగుమతి చేసుకునేందుకు సుంకం చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ దరఖాస్తుకు సమయం ఇవ్వడంతో పాటు నవంబరు 1 నుంచి కొత్త విధానం అమలులో ఉన్నందున, ఇప్పటికే ఉన్న కంపెనీల షిప్‌మెంట్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోగా పరిశ్రమ సంస్థలు తెలిపాయి.

బంగారం ప్రియులకు బిగ్ షాక్

మహిళలకు బిగ్ షాక్. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు, నేడు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,950 ఉండగా, నేడు 200 పెరగడంతో గోల్డ్ ధర రూ. 55,150 గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,950గా ఉండగా, నేడు 210 పెరగడంతో, గోల్డ్ ధర రూ.60,160గా ఉంది.

విడుదల రోజే 3 లక్షల రెడ్ మీ ఫోన్ల అమ్మకం

భారత మార్కెట్లో చైనీ మొబైల్ కంపెనీ షావోమీ రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. రెడ్ మీ బ్రాండ్ పై రెడ్ మీ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేయగా, మొదటి రోజే 3 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. రెడ్ మీ 12, రెడ్ మీ 12 5జీ ఫోన్లను నాలుగు రోజుల క్రితమే విడుదల చేసింది. ఫ్లాగ్ షిప్ ఫోన్ ఫీచర్లను అందిస్తున్న ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు తెగ ఆసక్తి చూపించారు. ఇందులో రెడ్ మీ 12 5జీ స్నాప్ డ్రాగన్ 4వ జనరేషన్ 5జీ ప్రాసెసర్ తో రావడం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. 4ఎన్ఎం ఆర్కిటెక్చర్ పై ఇది తయారైంది. 5జీ వేగానికి అనుకూలంగా ఇది కూడా చాలా వేగవంతమైన పనితీరును అందిస్తుంది. రెడ్ మీ 12 సిరీస్ ఫోన్లు పెద్ద  ఎత్తున అమ్ముడుపోవడం వెనుక ధరల ప్రభావాన్ని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా పోటీ ధరలను రెడ్ మీ ప్రకటించింది.రెడ్ మీ 12 5జీ ఫోన్ 6.79 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంటాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. దీని ధర రూ.10,999 నుంచి మొదలవుతుంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ.10,999. 6జీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.12,499. 8జీబీ ర్యామ్, 256 జీబీ వెర్షన్ ధర రూ.14,499. ఆగస్ట్ 4 నుంచి అమెజాన్, ఎంఐ డాట్ కామ్, రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.రెడ్ మీ 12 అనేది 4జీ ఫోన్. స్క్రీన్, రీఫ్రెష్ రేటు అన్నవి 5జీ ఫోన్ వేరియంట్ లో మాదిరే ఉంటాయి. మీడియాటెక్ హీలియో జీ88 12న్ఎం ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్, 8 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ధర రూ.8,999.

బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం 4,070 కోట్లు

 బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌ – జూన్ క్వార్టర్‌‌‌‌ (క్యూ1) ‌‌‌‌లో రూ.4,070 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.2,168 కోట్లతో పోలిస్తే ఇది  88 శాతం ఎక్కువ. లోన్లు పెరగడం, వడ్డీ ఆదాయం మెరుగవ్వడంతో పాటు మొండిబాకీలు తగ్గడంతో బ్యాంక్ లాభం పెరిగింది. బీఓబీకి క్యూ1 లో రూ.10,997 కోట్ల నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) వచ్చింది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 24.4 శాతం గ్రోత్‌‌‌‌కు సమానం. వడ్డీయేతర ఆదాయం కూడా 2.8 రెట్లు పెరిగింది.  బ్యాంక్  గ్రాస్ ఎన్‌‌‌‌పీఏలు (మొండిబాకీలు) జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం33.8 శాతం తగ్గి రూ.34,832 కోట్లకు దిగొచ్చింది. గ్రాస్ ఎన్‌‌‌‌పీఏల రేషియో అడ్వాన్స్‌‌‌‌ల్లో 6.23 శాతం నుంచి 3.51 శాతానికి మెరుగుపడింది. నెట్ ఎన్‌‌‌‌పీఏల రేషియో 1.58 శాతం నుంచి రికార్డ్‌‌‌‌ కనిష్టమైన 0.78 శాతానికి తగ్గిందని బీఓబీ ప్రకటించింది.డొమెస్టిక్‌‌‌‌గా కరెంట్ అకౌంట్ డిపాజిట్లు జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  5.5 శాతం గ్రోత్ నమోదు చేసి, రూ.4,23,600 కోట్లకు చేరుకున్నాయి. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  వెహికల్ లోన్లు 22.1 శాతం, హోమ్‌‌‌‌ లోన్లు 18.4 శాతం, పర్సనల్ లోన్లు 82.9 శాతం, మోర్టగేజ్ లోన్లు 15.8 శాతం,  ఎడ్యుకేషన్ లోన్లు 20.8 శాతం పెరిగాయని బీఓబీ వివరించింది. వ్యవసాయ రుణాలు 15.1శాతం పెరిగి రూ.1,27,583 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. కాగా, బీఓబీకి దేశం మొత్తం మీద 8,205 బ్రాంచులు,   10,459    ఏటీఎంలు ఉన్నాయి. గ్లోబల్‌‌‌‌గా 17 దేశాల్లో 93 ఆఫీసులను ఆపరేట్ చేస్తోంది. బ్యాంక్ షేర్లు శుక్రవారం 2 శాతం తగ్గి రూ.191 దగ్గర  క్లోజయ్యాయి.