సర్వసాధారణంగా తిరుమలలో వీక్ డేస్‌లో భక్తుల రద్దీ తక్కువగానూ.. వీకెండ్‌లో భక్తుల రద్దీ పెరిగిపోతుంది. కానీ ఈ వారం సీన్ రివర్స్. ఎందుకోగానీ వీక్ డేస్‌లోనూ భక్తుల రద్దీ కొననసాగుతోంది. నేడు (మంగళవారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం స్వామివారిని 69,733 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 28,614 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.