అమెరికాలో అత్యంత ప్రముఖమైన నేపర్‌విల్ పబ్లిక్ లైబ్రరీ బోర్డు చైర్మన్‌గా భారత సంతతికి చెందిన ప్రముఖ సమాజ సేవకుడు అష్ఫక్ సయ్యద్ నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఇదే లైబ్రరీ బోర్డులో ఈ ఏడాది మే వరకు ట్రస్టీగా సేవలందించారు.యూఎస్‌లో నంబర్ వన్ లైబ్రరీగా పేరొందిన నేపర్‌విల్‌కు తనను అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ లైబ్రరీ గత పదేండ్లుగా లక్ష నుంచి రెండున్నర లక్షల పాపులేషన్ క్యాటగిరిలో ఉంటూ దేశానికే గర్వకారణంగా నిలిచిందని చెప్పారు.