Business

చైనా నుంచి ఏపీఐల దిగుమతులు అధికం

చైనా నుంచి ఏపీఐల దిగుమతులు అధికం

మందుల తయారీలో వాడే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏపీఐ) దిగుమతులు చైనా నుంచి మరింత పెరిగాయి. ప్రొడక్షన్ లింక్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) కింద బల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం ప్రొత్సహిస్తున్నప్పటికీ గత తొమ్మిదేళ్లలో చైనా నుంచి వీటి దిగుమతులు ఏటా 7 శాతం చొప్పున పెరుగుతూనే ఉన్నాయి. ఇండియా దిగుమతి చేసుకుంటున్న బల్క్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చైనా వాటా 2013–14 లో 62 శాతం ఉండగా, 2022–23 నాటికి ఈ నెంబర్ 75 శాతానికి పెరిగింది. వాల్యూ పరంగా చూసినా చైనా వాటా 64 శాతం నుంచి 71 శాతానికి చేరుకుందని కేర్ రేటింగ్స్ పేర్కొంది. కీ స్టార్టింగ్ మెటీరియల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం) కోసం చైనాపై భారీగా ఆధారపడుతున్నామని ఈ సంస్థ సీనియర్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ అన్నారు.

2013–14 లో 5.2 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇండియా దిగుమతి చేసుకుందని, ఇందులో 2.1 బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చైనా నుంచే వచ్చాయని వెల్లడించారు. 2018–19 లో మొత్తం ఫార్మా దిగుమతులు 6.4 బిలియన్ డాలర్లకు చేరుకోగా చైనా వాటా 2.6 బిలియన్ డాలర్లకు, 2020–21 లో ఫార్మా దిగుమతులు 7 బిలియన్ డాలర్లకు పెరగగా ఇందులో చైనా వాటా 2.9 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. ‘2021–22 లో ఫార్మా దిగుమతులు 8.5 బిలియన్ డాలర్లుగా చైనా వాటా 3.2 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22–23 లో ఈ నెంబర్లు వరుసగా 7.9 బిలియన్ డాలర్లు, 3.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి’ అని కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మరో సీనియర్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పులకిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగర్వాల్ అన్నారు.

ఫార్మా దిగుమతుల్లో ఏపీఐ వాటానే ఎక్కువ..
గత పదేళ్లలో ఇండియా చేసుకున్న ఫార్మా దిగుమతుల్లో 55–60 శాతం వాటా బల్క్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే (ఏపీఐ) ఉంది. అంతేకాకుండా వీటి విలువ గత కొన్నేళ్లుగా 7 శాతం యాన్యువల్ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమోదు చేస్తోంది. దీనిని బట్టి దేశ ఫార్మా ఇండస్ట్రీస్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోందని చెప్పొచ్చు. ఏపీఐతో పాటు ఆయూష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెర్బల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్జికల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల దిగుమతులు కూడా పెరిగాయి. కాగా, దేశంలో సుమారు 3 వేల బల్క్ డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. కానీ, ఇవన్నీ చిన్న కంపెనీలు.