Health

హోమియోపతి చికిత్సలో జాగ్రత్తలు

హోమియోపతి చికిత్సలో జాగ్రత్తలు

మనలో చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్స్ వాడలేక హోమియోపతిని ఎక్కువగా వాడుతుంటారు. కొంత మంది చికిత్స కోసం అల్లోపతి మందుల కంటే హోమియోపతి మందులనే తీసుకుంటూ ఉంటారు. కానీ ఇవి తీసుకున్న వెంటనే పని చేయవు.. తగ్గడానికి కొంత సమయం పట్టొచ్చు కానీ, వ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తుంది. అల్లోపతిలో కూడా తగ్గని కొన్ని వ్యాధులు హోమియోపతి మందులకు తగ్గుతాయి. అయితే, దీనికి మాత్రం కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా చేస్తే ఈ మందులు వెంటనే మంచి ప్రభావం చూపుతుంది. మద్యపానం, గుట్కా, ధూమపానం చేయని వారికి హోమియోపతి ప్రభావం త్వరగా కనిపిస్తుంది. అలాగే దీని ఫలితం కూడా చాలా మంచిగా వస్తుంది. కాబట్టి ఈ మెడిసిన్స్ వాడేవారు తప్పకుండా కొన్ని నియామాలని పాటించాలి. అవేంటో ఇక్కడ చూద్దాం..ఎండ ఎక్కువగా వచ్చే ప్రదేశంలో ఈ మందులను పెట్టకూడదు. వీటిని ఎప్పుడూ చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. ఎందుకంటే వేడి ప్రదేశంలో ఉంచితే దీని ప్రభావం తగ్గిపోతుంది. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంచాలి. అలాగే మెడిసిన్ బాటిల్ మూతను ఎప్పుడూ తెరిచి ఉంచకండి. వీటిని ఎప్పుడూ చేతిలోకి తీసుకుని వేసుకోవద్దు. మూత ద్వారా మాత్రమే వీటిని నోట్లో వేసుకోవాలి.ఈ మందులు వేసుకున్న పది నిమిషాల వరకు ఏమీ తినకూడదు.. అలాగే తాగకూడదు. కాఫీ, టీ, పుల్లటి ఆహారాలు తీసుకోకూడదు.