Business

Startup:ఉద్యోగులను తీసేసి…వేరే సంస్థకు సిఫార్సు

Startup:ఉద్యోగులను తీసేసి…వేరే సంస్థకు సిఫార్సు

పరిస్థితుల కారణంగా వారిని ఉద్యోగం నుంచి తొలగించాల్సి వచ్చింది అని కంపెనీ సీఈవో సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ఈ మధ్యకాలంలో ప్రతి సంస్థలో లేఆఫ్ లు చాలా ఎక్కువయ్యాయనే చెప్పాలి. అయితే, ఒక్కసారి ఉద్యోగం తీసేసిన తర్వాత, ఆ ఉద్యోగుల గురించి ఏ కంపెనీ  పట్టించుకోదు. కానీ, ఓ కంపెనీ మాత్రం తమ కంపెనీ నుంచి తొలగించిన ఉద్యోగుల గురించి ఆలోచించింది. తమ కంపెనీ నుంచి తొలగించిన ఉద్యోగులకు వేరే కంపెనీలో ఉద్యోగం ఇవ్వండి అంంటూ వేరే కంపెనీలను రిక్వెస్ట్ చేయడం విశేషం.

ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఫామ్ పే ఇటీవల తమ సంస్థ నుంచి దాదాపు 18మంది ఉద్యోగులను తొలగించింది. పరిస్థితుల కారణంగా వారిని ఉద్యోగం నుంచి తొలగించాల్సి వచ్చింది అని కంపెనీ సీఈవో సోషల్ మీడియాలో పేర్కొన్నారు.అయితే, తాము తొలగించిన ఉద్యోగులకు ఎవరైనా జాబ్ ఇవ్వండి అంటూ, ఇతర కంపెనీల రిక్రూటర్స్ ని అడగడం విశేషం. తమ 18మంది ఉద్యోగులను తాము కోల్పోయామని, ఇది తమకు చాలా బాధాకరం అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తమ ఉద్యోగులను కోల్పోవడం తమకు ఎంతో బాధకలిగించిందని పేర్కొన్నారు.
ఆ ఉద్యోగులంతా మంచి టాలెంటెడ్ అని కూడా పేర్కొన్నారు. ఎవరైనా రిక్రూటర్స్ ఉద్యోగుల కోసం చూస్తున్నట్లయితే, తమకు మెసేజ్ చేయమని, తాము తీసేసిన వారికి సమాచారం ఇస్తామంటూ చెప్పడం విశేషం. వారు చేసిన పనిని కొందరు సమర్థిస్తుంటే, మరి కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. అంత టాలెంట్ ఉన్నవారు అయితే, ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసేయాలి అని ప్రశ్నిస్తుండటం గమనార్హం.