DailyDose

ఉత్తరాఖండ్‌లో వర్షాలు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు

ఉత్తరాఖండ్‌లో వర్షాలు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు

గతరెండు రోజులుగా ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలతో అనేక మంది యాత్రికుల అక్కడ చిక్కుకుపోయారు. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించాయి. రుషికేశ్‌కు 40కి.మీ దూరంలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే 20గంటలుగా పడిగాపులు కాస్తున్నారు. కొడియాల వద్ద 1500 వాహనాలు, 20వేల మంది ప్రజలు ఉండిపోయారు. త్వరగా సహాయక చర్యలు చేపట్టాలని యాత్రికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బెంగళూరు, ఏపీ నుంచి వెళ్లిన పలువురు తెలుగు యాత్రికులు(Telugu Pilgrims) కూడా అందులో ఉన్నారు. వారంతా తిరుగుప్రయాణంలో చిక్కుకున్నారు.