వివిధ బ్యాంకులు పలు చార్జీల నిమిత్తం ఐదేళ్ల కాలంలో కస్టమర్ల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేశాయో తెలిసింది. అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్‌లు లేకపోవడంపై పెనార్టీలు, అదనపు ఏటీఎం లావాదేవీలు, ఎస్‌ఎంఎస్ సేవలపై ఛార్జీల రూపంలో 2018 నుంచి బ్యాంకులు రూ.35,000 కోట్లకు పైగా వసూలు చేశాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. గత ఐదేళ్లలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులతో సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి సేకరించిన గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ తాజాగా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
కనీస బ్యాలెన్స్ లేదని బ్యాంకులు వసూలు చేసిన సొమ్ము ₹35వేల కోట్లు
Related tags :