కేరళ రాష్ట్రం అధికారికంగా పేరు మార్చుకోనున్నట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా.. అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఆ తీర్మానం ప్రకారం ప్రస్తుతం ఉన్న కేరళ పేరును ‘కేరళమ్’గా మారుస్తారు. అసెంబ్లీ మద్దతు లభించడంతో ఈ బిల్లును కేంద్ర ఆమోదానికి పంపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా సీఎం పినరయ్ విజయన్ కేంద్రాన్ని కోరారు. ఇంగ్లీష్‌తో సహా అన్ని భాషల్లో రాష్ట్ర పేరను కేరళమ్‌గా మార్చాలని అన్నారు. సభ్యులు తీర్మాణాన్ని అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ శంషీర్ కూడా ఆమోదించారు. కేరళ రాష్ట్ర పేరును మలయాళంలో కేరళమ్ అనే అంటారు. కానీ, మిగిలిన అన్ని భాషల్లో కేరళగానే పిలుస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి మలయాళ భాష మాట్లాడే వారందర్ని కలిపి ఒక రాష్ట్రంగా పరిగణించారు. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో రాష్ట్రం పేరును కేరళగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పేరును రాష్ట్ర సర్కార్ మార్చాలని నిర్ణయించింది.
కేరళ పేరు మార్పుకి అసెంబ్లీ ఆమోదం
Related tags :