నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం ముద్రించినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖ సూచనలతో రూ.100 నాణెం అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. ఈ నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నెల 28న అధికారికంగా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. రాష్ట్రపతి భవన్ సూచనలతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు పురంధేశ్వరి వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపించారు.
28న NTR ₹100 నాణెం విడుదల
Related tags :