NRI-NRT

పెద్దపల్లి యువకుడి TCSS-సింగపూర్ ప్రవాసుల సాయం

పెద్దపల్లి యువకుడి TCSS-సింగపూర్ ప్రవాసుల సాయం

పెద్దపల్లి జిల్లా వాసికి తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్), ఇతర ప్రవాసులు కలిసి ₹2.45లక్షలు అందజేశారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన గండికోట శ్రీనివాస్ గత ఏడాది ప్రమాదంలో గాయపడి కుడిచేతిని కోల్పోవడంతో పాటు కుడి కాలికి అయిన గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులకు తెలుపగా సభ్యులు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. సొసైటీ అధ్యక్షుడు గడప రమేశ్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, కార్యనిర్వాహక సభ్యులు మాదారపు సంతోష్, పెరుకు శివ రామ్ ప్రసాద్, సింగపూర్ ప్రవాసులు గుర్రం లక్ష్మీపతి తదితరులు సహకరించారు. సంతోష్ మాదారపు సమన్వయపరిచారు.