దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు ట్రేడింగ్ చివర్లో మళ్లీ పుంజుకుని చివరకు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 149 పాయింట్లు లాభపడి 65,996కి చేరుకుంది. నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 19,633 వద్ద స్థిరపడింది.