ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తనకున్న వింత అలవాటు గురించి చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు విభూది తినే అలవాటు ఉందని తెలిపింది. విభూది తినడం చాలా ఇష్టమట. ఇప్పటికీ తాను ఏదైనా ప్రదేశం వెళ్తే బ్యాగులో విభూది పెట్టుకుని వెళ్తానని.. విభూది తినడం మర్చిపోలేని అలవాటు. మంచి చెట్టు నుంచి తయారు చేసిన విభూది ఆరోగ్యానికి చాలా మంచిదని ఆమె తెలిపింది. గ్లామర్ దూరంగా ఉంటూ.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.
అది తినడమంటే చాలా ఇష్టం
Related tags :