ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబరు, నవంబరు మధ్య ఐసీసీ వన్డే ప్రపంచప్ (World Cup 2023) జరగనుంది. ఈ మెగా టోర్నీలో మ్యాచ్లకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆగస్టు 25నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ, బీసీసీఐ (BCCI)వెల్లడించాయి. టికెట్లు కావాలనుకునేవారు ఆగస్టు 15 నుంచి https://www.cricketworldcup.com/register పేజీలో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుంటే అందరికంటే ముందే టికెట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. E-Ticket ఆప్షన్ లేదని, అభిమానులు బాక్స్ ఆఫీస్ కౌంటర్ల నుంచి టికెట్లను పొందాల్సి ఉంటుందని వెల్లడించారు.
టికెట్ల విక్రయం తేదీలు..
* ఆగస్టు 25- నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్లు, అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్లు
* ఆగస్టు 30 – గుహవాటి, తిరువనంతపురంలో భారత్ మ్యాచ్లు
* ఆగస్టు 31 – చెన్నై, దిల్లీ, పుణెలో భారత్ మ్యాచ్లు
* సెప్టెంబర్ 1- ధర్మశాల, లఖ్నవూ, ముంబయిలో భారత్ మ్యాచ్లు
* సెప్టెంబర్ 2- బెంగళూరు, కోల్కతాలో భారత్ మ్యాచ్లు
* సెప్టెంబర్ 3- అహ్మదాబాద్లో భారత్ మ్యాచ్లు
* సెప్టెంబర్ 15- సెమీ ఫైనల్స్, ఫైనల్