ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే రోజుకు 10 వేల అడుగులు నడవాలనేది చాలా కాలంగా చెబుతున్నదే. అయితే ఎంతో కొంత నడవడం చాలా ముఖ్యం . అది నాలుగు వేల అడుగులైనా సరే …అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రపంచవ్యాప్తంగా 2,26,000 మందిపై చేసిన ఒక విశ్లేషణలో రోజుకు 4,000 అడుగులు నడిస్తే సడన్ గా హార్ట్ అటాక్స్ రావడం లాంటివి తగ్గుతాయి. గుండెకు, రక్తనాళాలకు మేలు కలగడం కోసం రోజుకు 2,300 అడుగులు నడిస్తే సరిపోతుంది.ఎంత ఎక్కువగా నడిస్తే, అంత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెప్పారు.నాలుగు వేలు దాటిన తర్వాత 20 వేల అడుగుల వరకు జోడించే ప్రతీ వెయ్యి అడుగులు అకాల మరణం ముప్పును 15 శాతం తగ్గించాయి.
నడక లేని మందులు వేస్ట్ అంటున్నారు అమెరికన్ సైంటిస్టులు. వ్యాధుల నుంచి మీకు రిలీఫ్ దొరకాలంటే పక్కాగా..నడక చాలా అవసరం . ఎక్కువ సేపు కూర్చోవడం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. ఒళ్లు కదపకుండా కూర్చుంటే ఎన్ని గంటలు కూర్చుంటే అంత త్వరగా అనారోగ్యానికి దగ్గరవుతున్నామని అర్ధం.
‘‘ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు వస్తాయి. కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల్లో ఈ సమస్యలను ఎక్కువగా చూస్తుంటాం. వారి వెన్నెముక నిరంతరం కుంచించుకుపోయిన స్థితిలో (కంప్రెస్డ్), ఒత్తిడిలో ఉంటుంది. ఇది తర్వాత చాలా సమస్యలకు దారి తీస్తుంది’’ అని హనీ ఫైన్ వివరించారు. వ్యాయామంతో నేరుగా సంబంధం లేని, అంటే చూడటానికి వ్యాయామం చేస్తున్నట్లుగా ఉండేవి చాలా బాగా పనిచేస్తాయి.
‘‘నిల్చోవడం, సరుకులను మోసుకురావడం, నేలను శుభ్రం చేయడం, ఊడ్చటం, ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు అటూ ఇటూ తిరగడం వంటి చిన్న చిన్న పనులన్నీ మన కేలరీలను ఖర్చు చేయడంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి . రోజు నడవడాన్ని డైలీ రొటీన్ లో భాగం చేసుకుంటే ఆరోగ్య పరంగా చాలా గొప్ప ప్రయోజనాలు కలుగుతాయని ఆమె తెలిపారు. ఇంట్లో ఫోన్ మాట్లాడుతూ… నలభై నిమిషాలు నడిచినా చాలంటున్నారు డాక్టర్లు. ఇది గుండెపోటును రాకుండా ఆపుతుందని క్లారిటీ గా చెబుతున్నారు.