సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్. దర్శకుడు నెల్సన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. జైలర్ ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక జైలర్ చిత్ర ప్రీమియర్స్ ముగియగా టాక్ బయటకొచ్చింది. ట్విట్టర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ ఇలా ఉంది…
కథ:జైలర్ చిత్ర కథ గురించి చెప్పాలంటే రిటైర్డ్ ఉద్యోగి అయిన రజినీకాంత్ ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ప్రశాంతంగా ఉన్న అతని జీవితాన్ని మాఫియా డిస్టర్బ్ చేస్తుంది. ఒకప్పటి ఈ జైలర్ కుటుంబం కోసం మాఫియాపై యుద్ధం మొదలుపెడతాడు. బడా మాఫియాతో వన్ మాన్ ఆర్మీ రజినీకాంత్ ఎలా పోరాడి గెలిచాడు అనేదే కథ.రజనీకాంత్ తన స్థాయి హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. 2.0 ఆయన చివరి క్లీన్ హిట్ అని చెప్పొచ్చు. వరుస చిత్రాలు చేస్తున్నారు కానీ విజయం దక్కడం లేదు. ముఖ్యంగా తెలుగులో ఆయన సినిమాలకు భారీగా మార్కెట్ పడిపోయింది. ఫ్యాన్స్ మాత్రం సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి జైలర్ తో ఆ కోరిక తీరిందా…
ఆడియన్స్ అభిప్రాయంలో జైలర్ మూవీ ఫస్ట్ హాఫ్ రీసెంట్ గా ఉంది. నెల్సన్ మార్క్ కామెడీ, హీరో క్యారెక్టరైజేషన్ మెప్పిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్,ట్విస్ట్ సైతం ఆకట్టుకుంటాయి. ఎప్పటిలాగే నెల్సన్ డార్క్ కామెడీ ట్రై చేశాడు. అది నవ్వులు పూయించింది. రజినీకాంత్ అప్పీరెన్స్, మేనరిజం అద్భుతం అంటున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ కి ట్రీట్. అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. అలాగే గత చిత్రాలకు భిన్నమైన క్యారెక్టరైజేషన్ రజినీకాంత్ కలిగి ఉన్నాడని ట్విట్టర్ లో ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయి. చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తుంది. సెకండ్ హాఫ్ సైతం ఎంటర్టైనింగ్ గా సాగుతుందని నెటిజెన్స్ ఒపీనియన్. అయితే మూవీ స్లోగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ రజినీకాంత్ యుద్ధం మొదలుపెట్టే వరకు సినిమా నెమ్మదిగా నడుస్తుంది.
అలాగే జైలర్ మూవీ కథపై కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది హాలీవుడ్ మూవీ నోబడీ కథను పోలి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనిరుధ్ మ్యూజిక్ కి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొందరు ఆడియన్స్ బాగుంది అంటే, మరికొందరు అతిగా వాయించేశాడు అంటున్నారు.మొత్తంగా జైలర్ మూవీ డీసెంట్ గా ఉందంటున్నారు. సినిమా అద్భుతం అని చెప్పలేం కానీ బోర్ కొట్టకుండా సాగుతుంది. రజినీకాంత్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మిగతా ఆడియన్స్ ని అబోవ్ యావరేజ్ అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో రజినీ చిత్రాలతో పోల్చితే జైలర్ కి బెటర్ టాక్ వినిపిస్తుంది. ట్విట్టర్ ఆడియన్స్ అభిప్రాయం ఇలా ఉంది. పూర్తి రివ్యూ వస్తే కానీ సినిమా ఫలితం తెలియదు.జైలర్ మూవీలో రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించడం జరిగింది. అనిరుధ్ సంగీతం అందించారు.